హెల్త్ ఇన్యూరెన్స్ అమలులో కీలక మార్పులు - ఆ బాధితులకూ భీమా..!!
ఐఆర్డీఏ హెల్త్ ఇన్సూరెన్స్ అమలులో కీలక మార్పులు చేసింది. తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. హెల్త్ ఇన్సూరెన్స్ వయో పరిమితి రద్దు చేసింది. క్యాన్సర్, గుండెజబ్బులు, ఎయిడ్స్ బాధితులకూ బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఇన్సూరెన్స్ వెయిటింగ్ కాలవ్యవధి 48 నెలల నుంచి 36 నెలలకు తగ్గిస్తూ నిర్ణయించింది. జబ్బుల గురించి పాలసీదారులు వెల్లడించకపోయినా బీమా వర్తించాల్సిందేనని స్పష్టం చేసింది. తాజాగా మార్పులతో నోటిఫికేషన్ విడుదల చేసింది.
పాలసీల్లో మార్పులు
ఐఆర్డీఏ ఆరోగ్య భీమా పాలసీలో మార్పులు చేసింది. పాలసీ పైన మారటోరియం సమయం తగ్గించింది. ఆరోగ్య బీమా పాలసీల కొనుగోలుకు ఉన్న వయోపరిమితిని ఎత్తివేసింది. కనుక ఇకపై సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, పిల్లలు, గర్భిణులతో సహా, కాంపిటెంట్ అథారిటీ పేర్కొన్న అన్ని వయస్సుల వారందరూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024 ఏప్రిల్ 1 నుంచే ఈ మార్పు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఇంతకు ముందు కొత్త ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలు చేయాలంటే గరిష్ఠ వయో పరిమితి 65ఏళ్లుగా ఉండేది. ఇకపై వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలు చేయవచ్చు.

వయో పరిమితి రద్దు
సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, పిల్లలు, గర్భిణులతో సహా, కాంపిటెంట్ అథారిటీ పేర్కొన్న అన్ని వయసుల వారికి బీమా సంస్థలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు డిజైన్ చేయవచ్చని ఐఆర్డీఏ పేర్కొంది. ముందస్తు వ్యాధుల వెయిటింగ్ పీరియడ్ , మారటోరియం పీరియడ్‌లను తగ్గించింది. పాలసీని తీసుకునే టైంలో పాలసీ తీసుకుంటున్న వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వివరాలను తొలుత తెలుసుకుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ప్రారంభం కావడానికి కొంతకాలం వెయింటింగ్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ బీమా తీసుకున్న వ్యక్తి ఈ గడువులో ఆస్పత్రి పాలైతే ఎలాంటి కవరేజీ లభించదు. దీన్నే పీఈడీ వెయిటింగ్ పీరియడ్ అని పిలుస్తుంటారు. ఇంతకుముందు నాలుగేళ్లుగా ఉన్న ఈ వెయిటింగ్ పీరియడ్ ను ఇప్పుడు 3 సంవత్సరాలకు ఐఆర్‌డీఏఐ తగ్గించింది.

వెయిటింగ్ పిరీయడ్ తగ్గింపు
హెల్త్ ఇన్సూరెన్సుకు సంబంధించిన మారటోరియం పీరియడ్‌ను కూడా ఐఆర్‌డీఏఐ సవరించింది. ఇంతకుముందు వరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మారటోరియం వ్యవధి 8 సంవత్సరాలుగా ఉండేది. ఇప్పుడు దాన్ని 5 ఏళ్లకు తగ్గించారు. అంటే పాలసీని తీసుకున్న తర్వాత 5 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లిస్తే, ఒప్పందం ప్రకారం అన్ని క్లెయిమ్‌లను బీమా సంస్థ చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నప్పుడు కొన్ని వ్యాధులకు చికిత్సలపై నిర్దిష్ట కాలం పాటు వెయిటింగ్ పీరియడ్ వ్యవధి 4 సంవత్సరాలుగా ఉంది. దీన్ని తాజాగా ఐఆర్‌డీఏఐ మూడేళ్లకు(36 నెలలకు) తగ్గించింది. ఈ వ్యవధి ముగిసిన తర్వాత పాలసీలో పేర్కొన్న చికిత్సలపై పాలసీదారుడు కవరేజీని పొందొచ్చు. తాజా మార్పులు ఇప్పటికే పాలసీ తీసుకున్న వారికి కూడా వర్తించనున్నాయి.












Click it and Unblock the Notifications