• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపి ఇంట‌లీజెన్స్ విభాగం స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేయ‌డం లేదా..?

|

అమ‌రావితిలో జ‌రుగుతున్న న‌వ నిర్మ‌ణ దీక్ష‌లో ఏపి సీయం చంద్ర‌బాబు నాయుడు కీల‌కమైన అంశం గురించి ప్ర‌స్తావించి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసారు. కొద్ది రోజుల క్రితం సినీ హీరో శివాజీ ప్ర‌స్థావించిన ఆప‌రేష‌న్ గ‌రుడ అంశాన్ని చంద్ర‌బాబు న‌వ నిర్మ‌ణ దీక్ష‌లో ప్ర‌స్థావించారు. నిఘా విభాగం నివేదిక ఇవ్వ‌కుండానే, గూఢ‌చార వ్య‌వ‌స్థ ద్రువీక‌రించ‌కుండానే చంద్ర‌బాబు ఆ ప‌దాన్ని వాడేసారు.

  జూన్ 2 ఏపీకి చీకటి రోజు: నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు

  అంటే హీరో శివాజీ కి వ‌స్తున్న నిఘా స‌మాచారం కూడా చంద్ర‌బాబుకు రావ‌డంలేదా అని త‌మ‌లో తాము ప్ర‌శ్నించుకుంటున్నారు పార్టీ శ్రేణ‌లు. ఆప‌రేష‌న్ గ‌రుడ ప్ర‌స్థావ‌న వాస్థ‌వ‌మే అయితే చంద్ర‌బాబు ఇంటెలీజెన్స్ వ్య‌వ‌స్థ స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేయ‌డం లేద‌ని నిర్ధారించాల్సి ఉంటుంద‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.

   ఏపీ గూఢ‌చార వ్య‌వ‌స్థ స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయ‌డం లేదా..?

  ఏపీ గూఢ‌చార వ్య‌వ‌స్థ స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయ‌డం లేదా..?

  ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వ్య‌వ‌స్థ బ‌ల‌హీనంగాప‌నిచేస్తుందా..? జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను ముంద‌స్తుగా ప‌సిగ‌ట్టంలో విఫ‌లం చెందుతుందా..? ఆంద్ర ప్ర‌దేశ్ రాజ‌కీయ ర‌హ‌స్యాలు బ‌య‌టికి పొక్కుతున్నా నిఘా విభాగం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుందా అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల ప్ర‌త్యేక హోదా అంశం మీద పోరాటం చేస్తోన్న ఓ సినీ న‌టుడు ఏప‌రేష‌న్ గ‌రుడ పేరుతో దక్షిణ భార‌త దేశాన్ని ఛిన్నా భిన్నం చేయ‌డానికి ఓ వ‌ర్గం ప్ర‌య‌త్నాలు చేస్తోందని ఆ మ‌ద్య ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌సెంటేష‌న్ రూపంలో వివ‌రించారు. ఇదే అంశాన్ని శ‌నివారం అమ‌రావ‌తిలో న‌వ‌నిర్మాణ దీక్ష‌లో ఉన్న ఏపి సీయం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌స్థావించి అంద‌రిని ఆశ్య‌ర్యానికి గురి చేసారు.

   ఆప‌రేష‌న్ గ‌రుడ అంశాన్ని చంద్ర‌బాబు ప్ర‌స్థ‌వించ‌డం వెన‌క మ‌త‌ల‌బు ఏంటి..

  ఆప‌రేష‌న్ గ‌రుడ అంశాన్ని చంద్ర‌బాబు ప్ర‌స్థ‌వించ‌డం వెన‌క మ‌త‌ల‌బు ఏంటి..

  ఆప‌రేష‌న్ గ‌రుడ అనే అంశాన్ని, అంత పెద్ద వ్యవస్థ పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం కనుక్కోలేని విషయాన్ని, ఓ సినీ నటుడు కనిపెట్టగలిగారా అన్న‌దే ప్ర‌శ్న‌గా మారింది. ఏపీలో టీడీపీ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి ‘ఆపరేషన్ గరుడ' ప్రారంభం అయిందని.దీని కోసం వేల కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నారని హీరో శివాజీ వెల్లడించారు. ఇప్పటికే ఇది ప్రారంభం అయిందని ఆయన తేల్చేస్తే...దీనిపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యలు విన్పించాయి. చంద్రబాబు, మోడీల జోడీ నాలుగేళ్లు కలసి సాగింది. తర్వాత చంద్రబాబు బీజెపి విధాల‌ను వ్య‌తిరేకించి కేంద్ర ప్ర‌బుత్వం నుండి బ‌య‌ట‌కు వ‌చ్చారు.

  సినిమా హీరోకి తెలుస్తున్న నిఘా ర‌హ‌స్యాలు ముఖ్య‌మంత్రికి తెలియ‌డం లేదా..

  సినిమా హీరోకి తెలుస్తున్న నిఘా ర‌హ‌స్యాలు ముఖ్య‌మంత్రికి తెలియ‌డం లేదా..

  సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రత్యర్థి పార్టీని దెబ్బకొట్టడానికి చూస్తుంది. అది చంద్రబాబు అయినా...మోడీ అయినా అలాగే చేస్తారు. అయితే ఏపీ విషయానికి వస్తే బిజెపికి పెద్దగా పట్టు లేదు అక్కడ . సొంతంగా ఓ రెండు సీట్లు కూడా గెలుస్తుందని చెప్పలేని పరిస్థితి. అలాంటిది ఏపీలో ఆపరేషన్ గరుడుకు ఏకంగా 4500 కోట్ల రూపాయలుపైనే ఖర్చు పెట్టనున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి నియోజకవర్గానికి 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాలకు 2625 కోట్ల రూపాయలకు మించి ఖ‌ర్చు కాదు. పోనీ ఇతర ఖర్చులు మరో 400 కోట్లు వేసుకున్నా మొత్తం మూడు వేల కోట్ల రూపాయలు దాటదు. కానీ ఏకంగా ఒక్క ఏపీ కోసం 4500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆపరేషన్ గరుడ అమలు చేస్తున్నారా అని ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు రాజ‌కీయ నాయ‌కులు.

   గూఢ‌చార వ్య‌వ‌స్థ లోపాల‌ను ప్ర‌క్షాళ‌న చేయాల్సిన స‌మ‌యం..

  గూఢ‌చార వ్య‌వ‌స్థ లోపాల‌ను ప్ర‌క్షాళ‌న చేయాల్సిన స‌మ‌యం..

  అన్నింటి కంటే విచిత్రం ఏమిటంటే శనివారం నాడు విజయవాడలో నిర్వహించినన నవనిర్మాణ దీక్ష లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శివాజీ లేవనెత్తిన ‘ఆపరేషన్ గరుడ' అంశాన్ని సభలో ప్రస్తావించారంటే చంద్రబాబు నిజంగా దీన్ని నమ్ముతున్నట్టు భావించ‌వ‌చ్చు. నమ్మితే ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని అంగీకరించినట్టు కూడా అవుతుంది. కాదు అంటే కేవలం ప్రజల్లో సానుభూతి పొందటానికి దీన్ని వాడుకున్నారని భావించకతప్పదు. అంటే ప‌టిష్ట నిఘా విభాగం వ్యవస్థ క‌లిగి ఉన్న‌ చంద్రబాబు సర్కారు కనిపెట్టలేని అంశాన్ని, హీరో శివాజీ ద్వారా తెలుసుకోవాల్సి రావటం చంద్రబాబు ఇంట‌లీజెన్స్ వైఫ‌ల్యంగా భావించ‌వ‌చ్చ‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఓటుకు నోటు అంశంలో కూడా ఇంటెలీజెన్స్ వ్య‌వ‌స్థ లోపం వ‌ల్ల‌నే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పూర్తిగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయిన‌ట్టు ఆ మ‌ద్య వార్తులు వ‌చ్చాయి. తాజాగా చంద్ర‌బాబు చేసిన ఆప‌రేష‌న్ గ‌రుడ ప్ర‌స్థావ‌న ఎన్ని మ‌లుపులు తిరుగుతుందో చూడాలి.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  lok-sabha-home

  English summary
  telugu desam party national president chandrababu naidu spoke about operation garuda in nava nirmana deeksha on saturday. about the operation cene hero shivaji addressed few days ago. about the operation no intelligence report given to chandrababu so far. and also babu spoke about the operation. so officials felt that intelligence department failed to know about the matter.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more