లోకేష్ కోసం..: పొగిడినా జూ.ఎన్టీఆర్‌ను పట్టించుకోని స్థితిలో బాలకృష్ణ?

హైదరాబాద్: టాలీవుడ్ హీరో, తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ తన అల్లుడు నారా లోకేష్ కోసం.. హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు దూరం పాటిస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీ భావి నేత ఎవరనేది ఇప్పటికే దాదాపు నిర్ణయమైపోయింది.

ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడైన లోకేష్ ఇప్పటికే పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. దీనిపై మంత్రులు కూడా స్పందించారు. మంత్రి నారాయణ ఓ సమయంలో మాట్లాడుతూ.. టీడీపీ భావినేత లోకేషే అని చెప్పారు. మంత్రులతో లోకేష్ భేటీని గంటా శ్రీనివాసరావు కొద్ది రోజుల క్రితం వెనుకేసుకొచ్చారు.

సార్వత్రిక ఎన్నికలకు ముందు నందమూరి, నారా కుటుంబాల మధ్య విభేదాలు పొడసూపిన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం టీడీపీ గెలిచాక.. జూనియర్ ఎన్టీఆర్ ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. అయితే, వారి మధ్య విభేదాలు మాత్రం ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఈ విభేదాల నేపథ్యంలోనే.. అప్పటి నుండి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అంతగా ఆడలేదనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల హరికృష్ణ తనయులైన నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు తమ తమ సినిమా ఫంక్షన్లలో బాబాయ్ బాలకృష్ణ పేరు పలవరించారని చెబుతున్నారు.

కళ్యాణ్ రామ్‌తో బాలయ్యకు మంచి సంబంధాలే ఉన్నాయని, కానీ జూనియర్ ఎన్టీఆర్‌తోనే ఇప్పటికీ లేవని అంటున్నారు. బాలయ్య, కళ్యాణ్ రామ్‌ల మధ్య కుటుంబ, రాజకీయ చర్చలు వస్తాయంట! బాబాయ్ పైన తన అభిమానాన్ని చూపిస్తూ కళ్యాణ్ రామ్ పటాస్ చిత్రంలో బాలకృష్ణ చిత్రంలోని పాటను రీమిక్స్ చేశారు.

 Is Balakrishna Ignores Jr NTR?

ఇటీవల టెంపర్ ఆడియో లాంచ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్.. బాలయ్య లయన్ చిత్రాన్ని ప్రస్తావించారు. ఇది నందమూరి నామ సంవత్సరమని పేర్కొన్నారు. తద్వారా అభిమానులను ప్రసన్నం చేసుకునే అభిప్రాయం జూనియర్ ఎన్టీఆర్‌లో కనిపించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కళ్యాణ్ రామ్, జూ ఎన్టీఆర్‌లు తన పైన ప్రశంసలు చేసినప్పటికీ బాలకృష్ణ వాటిని విస్మరిస్తున్నారని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వంటి వారి ప్రశంసలను ఆస్వాదించే పరిస్థితులో కూడా బాలకృష్ణ లేరంటున్నారు.

2009లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరఫున ప్రచారం చేశారు. 2014 ఎన్నికల్లో మాత్రం ప్రచారం చేయలేదు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు టీడీపీ ప్రాధాన్యత ఇచ్చింది. కానీ జూనియర్‌ను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు జూనియర్.. చంద్రబాబును కలిసినప్పటికీ, బాలయ్యను పొగిడినప్పటికీ బెండ్ అయితే, భవిష్యత్తులో మొదటికే మోసం రావొచ్చని, అందుకే బాబు, బాలయ్యలు విస్మరిస్తున్నారని అంటున్నారు.

బాలకృష్ణ... టీడీపీలో తన అల్లుడు లోకేష్‌ను ఎలివేట్ చేసేందుకు వ్యూహాత్మకంగా జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలతో దూరం పాటిస్తుండవచ్చునని అంటున్నారు. టీడీపీ భావి నేత విషయంలో రగడ ప్రారంభమయ్యాక.. బాలకృష్ణ తన చిన్న కూతురు పెళ్లి చేశారు. దానికి జూనియర్‌ను ఆహ్వానించనట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుండి అదే డిస్టెన్స్ మెయింటెన్స్ చేస్తున్నారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+