బిగుస్తోన్న ఉచ్చు, ఒత్తిడిలో బాబు!: 'సుప్రీం' మేరకు తప్పించుకోలేరా?
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉచ్చు బిగుసుకుంటోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. నమస్తే తెలంగాణలో ఓ కథనం వచ్చింది.
ఈ కేసులో చంద్రబాబుపై ఆరోపణలకు సంబంధిచి ఏసీబీ బలమైన సాక్ష్యాధారాలను సేకరించిందని, గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుల మేరకు ఈ కేసులో చంద్రబాబుతో పాటు ఇతర నిందితులు ఎవరూ తప్పించుకోలేరని న్యాయ నిపుణులు తెలిపారని పేర్కొంది.
దీంతో చంద్రబాబు ఒత్తిడిలో ఉన్నారని, ఈ కేసులో మరికొంత మంది అరెస్టు తప్పదని విశ్వనీయ సమాచారం అందుతోందని రాసింది. కాగా, సాంకేతిక కారణాలతో తప్పించుకోలేమని ఏపీ అధికారులు చంద్రబాబుకు సూచించినట్లుగా కూడా పేర్కొంది.

దీంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదని, కేసు నుంచి తప్పించుకునేందుకు దారులన్నీ మూసుకు పోవడంతో నిందితులంతా బిక్కుబిక్కుమంటున్నారని, కేసు నుంచి తప్పించుకోలేక చంద్రబాబు అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారని రాసింది.
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు ఇచ్చిన రూ.50 లక్షలు ఎక్కడ నుంచి వచ్చాయన్న అంశం కూడా కీలకం కానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారని, రూ.50 లక్షలకు సంబంధించి వ్యవహారంలో మరికొంత మంది ఇరుక్కునే అవకాశం ఉందని సమాచారమని రాసింది.
కాగా, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు గవర్నర్ అపాయింటుమెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, చంద్రబాబు అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications