కాలుపై కాలేసుకున్న వనజాక్షి!, బాబు ఏమైనా పెదరాయుడా: చెవిరెడ్డి

చిత్తూరు/విజయవాడ: కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి టీడీపీ చీఫ్ విప్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను గౌరవించలేదని, రేవు వద్దకు వెళ్లినప్పుడు కాలుమీద కాలు వేసుకొని ఆమె కూర్చొని సమాధానం ఇచ్చారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రభుత్వ విప్‌ను రౌడీ, గూండా అనే అధికారం రెవెన్యూ ఉద్యోగ సంఘాలకు ఎక్కడిదన్నారు. ఘర్షణతో తమకు సంబంధం లేకున్నా వనజాక్షి కన్నీరు పెట్టుకొన్న ఘటనలో చింతమనేని చింతించారన్నారు. సీఎం చంద్రబాబు తన ఇంటిలో ప్రభాకర్‌కు, ఉద్యోగ సంఘాలకూ రాజీ కుదిర్చాక వీరు ఇటువంటి వ్యాఖ్యలు సరికాదన్నారు.

చంద్రబాబు పెదరాయుడా?: చెవిరెడ్డి

Is Chandrababu Naidu Pedarayudu: Chevi Reddy

తగువులు పరిష్కరించేందుకు చంద్రబాబు ఏమైనా పెదరాయుడా అని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు పరిష్కారం చేస్తే న్యాయస్థానాలు ఎందుకన్నారు. చంద్రబాబు తన నీడను తానే నమ్మడని, అందుకే కోట్లాది రూపాయలతో ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేస్తున్నారన్నారు.

ఏపీ ప్రభుత్వం గోదావరి పుష్కరాలకు రూ.1650 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, అందులో వెయ్యి కోట్లకు పైగా అవినీతి జరిగిందన్నారు. పుష్కరాల సొమ్మును కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సంపాదనకు ఆదాయమార్గంగా ఉపయోగించుకుంటున్నారన్నారు. దీనిపై విచారణ జరిపించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+