chiranjeevi: ఆ మెగా హీరో ఉంటే చిరు సినిమా ఫ్లాపేనా..?
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమానే హాట్ టాపిక్‌గా మారింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చింది. చిరంజీవి సినిమాల్లో కమ్ బ్యాక్ చేసిన తరువాత .. ఆచార్యనే పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. కాని తాజాగా వచ్చిన భోళా శంకర్ ఆచార్య స్థానాన్ని భర్తీ చేసేలా కనిపిస్తోంది.
80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా .. ఇప్పటివరకూ అందులో సగం కూడా కలెక్ట్ చేయలేకపోయిందని బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. చిరంజీవి కన్నా కూడా ఈ సినిమా ప్రభావం దర్శకుడు మెహర్ రమేశ్ మీద ఎక్కువుగా పడింది. సినిమా బాలేకపోవడంతో.. అందరూ కూడా మెహర్ రమేశ్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ జాబితాలోకి ఓ మెగా హీరో వచ్చి చేరాడు. భోళా శంకర్ సినిమాలో ఓ మెగా హీరో ఉన్నాడని.. ఆ హీరో ఉంటే చిరంజీవి సినిమా ఫ్లాప్ అవుతుందని వాదన ఒకటి కొత్తగా తెర మీదకు వచ్చింది. చిరంజీవితో కలిసి ఆ హీరో నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్లా కొట్టాయని నెటిజన్లు సాక్ష్యాలను కూడా చూపిస్తున్నారు.

ఆ మెగా హీరో మరెవ్వరో కాదు..మెగా ఫ్యామిలీకి చెందిన కొణిదెల పవన్ తేజ్. ఈ పేరు పెద్దగా ప్రేక్షకులకు తెలియకపోయిన.. మెగా అభిమానులకు మాత్రం కొణిదెల పవన్ తేజ్ సుపరిచితుడే. చిరంజీవి నటించిన గత మూడు సినిమాలలో కూడా కొణిదెల పవన్ తేజ్ నటించాడు. ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ ఈ సినిమాల్లో కొణిదెల పవన్ తేజ్ చిన్న పాత్రల్లో కనిపించాడు.

ఈ మూడు సినిమాల్లో గాడ్ ఫాదర్ కొంచెం పర్వాలేదనిపించిన కూడా నిర్మాతకు నష్టాలనే మిగిల్చింది. కొణిదెల పవన్ తేజ్ నటించిన కారణంగానే ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయని నెటిజన్లు మనోడిని ట్రోల్ చేస్తున్నారు. పవన్ తేజ్ నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో.. చిరంజీవి తన చేయబోయే సినిమాలలో ఆయన్ను తీసుకోవద్దని సూచిస్తున్నారు. మరి నెటిజన్ల కోరిక మెరకు చిరంజీవి పవన్ తేజ్‌ను తన తరువాత సినిమాల్లో తీసుకుంటారో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications