ఇదేనా విజన్?: చంద్రబాబుపై అంబటి రాంబాబు విసుర్లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు దాటినా అక్కడ ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు చేసిన ఐదు సంతకాల్లో ఒక్కటి కూడా అమలు కావడం లేదని ఆయన విమర్శించారు. అసలు ఇదే చంద్రబాబు విజన్ అని ప్రశ్నించారు
కేవలం ప్రజలను మభ్య పెట్టడమే తెలుగుదేశం పార్టీ ఎజెండానా అని అడిగారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పాలన కొనసాగించాల్సిన చంద్రబాబు కేవలం హైదరాబాదుకే పరిమితమయ్యారని ఆయన అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు అబద్ధాలు పక్కన పెట్టి ప్రజలకిచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేయాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications