• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మైల‌వ‌రం మైలురాయిని అదిగ‌మించ‌డం అంత సుల‌భమా..? క్రిష్ణ జిల్లా రాజ‌కీయం య‌మ ఘాటు సుమీ..!

|

హైద‌రాబాద్ :వ‌సంత‌నాగేశ్వ‌రావు ఈ పేరు ఎక్క‌డో విన్న‌ట్టు ఉంది క‌దూ..! ఒక‌ప్పుడు విశాఖ ఉక్కు.. ఆంధ్రు ల హ‌క్కు నినాదం., స‌మితి నుంచి హోంమంత్రిగా ఎదిగిన రాజ‌కీయ ప్ర‌స్థానం., ఎన్‌టీఆర్ హ‌యాంలో తిరుగులేని నేత‌. ఆయ‌న త‌న‌యుడు వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌. అభిమానులు.. ముద్దుగా కేపీ అని పిలుచుకుంటారు. సుధీర్గ రాజ‌కీయ మ‌జిలీలో వ‌సంత‌కు త‌న‌యడు కేపీను ఎమ్మెల్యేగా చూడాల‌నే ఆశ మాత్రం తీర‌లేదు. కొడుకును ఎమ్మెల్యే చేయాల‌న్న కోరిక మాత్రం నెర‌వేర‌లేదు. ఐనా చివ‌రి ప్ర‌య‌త్నం అంటూ మ‌రో సారి అద్రుష్టాన్ని ప‌రీ2క్షించుకునేంద‌కు సై అంటున్నారు.!

క్రిష్ణ జిల్లా రాజ‌కీయాల్లో పావుగా మారుతున్న వ‌సంత‌..! ఈ సార‌న్నా గెలుపు త‌లుపు త‌డుతుందా..?

క్రిష్ణ జిల్లా రాజ‌కీయాల్లో పావుగా మారుతున్న వ‌సంత‌..! ఈ సార‌న్నా గెలుపు త‌లుపు త‌డుతుందా..?

సైకిల్ దిగి.. హ‌స్తం ప‌ట్టుకుని.. మ‌ళ్లీ ప‌సుపు కండువా క‌ప్పుకున్న ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. పైగా నందిగామ నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ చేయ‌టంతో అక్క‌డ శాశ్వ‌త‌స్థానం ఏర్ప‌ర‌చుకున్న దేవినేని కుటుంబం కూడా మైల‌వ‌రం చేరాల్సి వ‌చ్చింది. పైగా.. వ‌సంతకు దేవినేని కుటుంబంపై ఒక్క‌సారైనా నెగ్గాల‌నే కోరిక దాదాపు పాతికేళ్లుగా ఉంది. తండ్రీత‌న‌యులిద్ద‌రూ పోటీచేసినా ఓట‌మి చ‌విచూశారు. వ‌సంత ఆరోగ్యం కూడా స‌హ‌క‌రించ‌ట్లేదు. అందుకే.. ఈ సారి కేపీను మైల‌వ‌రం నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా రంగంలోకి దింపారు. అక్క‌డ టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమామ‌హేశ్వ‌రావు సాగునీటి మంత్రిగా ఉన్నారు. పోల్ మేనేజ్‌మెంట్‌, ఎన్నిక‌ల వ్యూహ‌ర‌చ‌న‌లో ఆయ‌న‌కంటూ గుర్తింపు ఉంది.

ఎవ‌రికి అంతు చిక్క‌ని క్రిష్ణ జిల్లా రాజ‌కీయం..! కొర‌క‌రాని కొయ్య లా మారిన దేవినేని ఉమా..!!

ఎవ‌రికి అంతు చిక్క‌ని క్రిష్ణ జిల్లా రాజ‌కీయం..! కొర‌క‌రాని కొయ్య లా మారిన దేవినేని ఉమా..!!

అయితే సొంత పార్టీ నేత‌లు కొంద‌రు దేవినేని ఓట‌మి కోసం కోవ‌ర్టులుగా కూడా ప‌నిచేస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి. నందిగామ‌కు తంగిరాల సౌమ్య ఎమ్మెల్యే అయినా.. అక్క‌డా దేవినేని అనుచ‌రుల‌తో హ‌వా అనే ప్ర‌చార‌మూ లేక‌పోలేదు. ఇలా రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న ప‌ట్టు నిల‌బెట్టుకుంటున్న దేవినేని ఉమాను ఓడించేందుకు కేపీ ఈ ద‌ఫా తీవ్రంగానే ప్ర‌య‌త్నిస్తున్నారు. తండ్రి క‌ళ్ల‌లో ఆనందం చూడాలని ఉవ్విళూరుతున్నారు. రియ‌ల్ రంగంలో ఆర్ధికంగా నిల‌దొక్కుకోవ‌ట‌మే కాదు, కోట్లు కుమ్మ‌రించేత బ‌ల‌ప‌డ్డారు.

సుధీర్గ రాజ‌కీయ అనుభ‌వం క‌లిసొస్తుందా..? త‌న‌యున్ని గెలిపిస్తారా..?

సుధీర్గ రాజ‌కీయ అనుభ‌వం క‌లిసొస్తుందా..? త‌న‌యున్ని గెలిపిస్తారా..?

రాజ‌కీయ అనుభ‌వం కూడా ఇప్పుడు క‌లిసొచ్చే అంశం. పైగా టీడీపీ స‌ర్కారుపై ప్ర‌జా వ్య‌తిరేక‌త త‌మ‌కు అనుకూలిస్తుంద‌ని తండ్రీ కొడుకులు లెక్క‌లు వేసుకుంటున్నారు. మైల‌వ‌రంలో కేపీ వైసీపీ కార్యాల‌యాన్ని స్థాపించ‌టమే కాదు.. టీడీపీ వ్య‌తిరేక వ‌ర్గాల‌ను ఏకం చేసే ప‌నిలో ప‌డ్డారు. అయితే అక్క‌డ సీటు ఆశిస్తూ.. మ‌రోచోటికి వెళ్లిన జోగు ర‌మేష్‌ను కూడా త‌మ‌కు అనువుగా మ‌ల‌చుకున్నారు. నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా కార్య‌క్ర‌మాల చేప‌డ‌తున్నారు. పండ‌గ‌లు, వేడుక‌లు ఏది జ‌రిగినా క్ష‌ణాల్లో అక్క‌డ వాలిపోతున్నారు.

2019 ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రం కానున్నాయి..! ఎవ‌రిది పైచేయో చెప్ప‌లేని ప‌రిస్థితి..!!

2019 ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రం కానున్నాయి..! ఎవ‌రిది పైచేయో చెప్ప‌లేని ప‌రిస్థితి..!!

డిసెంబ‌రు 21 జ‌గ‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కృష్ణాజిల్లా ఎక్క‌డా నిర్వ‌హించని విధంగా 5వేల బైకుల‌తో ర్యాలీ నిర్వ‌హించి.. తెలుగు త‌మ్ముళ్ల లో గుబులు పుట్టించామంటున్నాయి వైసీపీ వ‌ర్గాలు. 2019లో దాదాపు పార్టీల‌న్నింటికీ గెలుపు స‌వాల్‌గా మారింది. ఇటువంటి క్లిష్ట‌మైన ఎన్నిక‌ల వేళ వ‌సంత త‌న పంతం నెగ్గించుకుంటారా! మ‌రోసారి.. దేవినేని చేతిలో గ‌త అనుభ‌వాన్ని చ‌విచూస్తారా! లేక అద్బుతాన్ని ఆవిష్క‌రిస్తారా చూడాలి.

English summary
In the vast political scene, vasantha nagesvara rao did not expect win his son KP as an MLA. The desire to make a son is not fulfilled. Vasantha said that the last attempt will be set to fire this time. .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X