పవన్‌తో జోరు: జూ ఎన్టీఆర్ డైలమా, వదిలేసిన బాబు!
హైదరాబాద్: మామ మైండ్ గేమ్ అల్లుడు చిత్తయ్యారా!? తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దెబ్బకు హీరో జూనియర్ ఎన్టీఆర్ డైలమాలో పడ్డారా? అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2009లో తెలుగుదేశం పార్టీకి జోరుగా ప్రచారం చేసిన జూనియర్ ఈ ఎన్నికల్లో మాత్రం దూరంగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టాం కూడా పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదు.
ఎన్టీఆర్ ప్రచారంపై ప్రశ్నిస్తే... పార్టీ పైన అభిమానం ఉన్న వాళ్లు రావాలని, ఎవరిని బొట్టు పెట్టి పిలిచేది లేదని చంద్రబాబు సహా కుటుంబ సభ్యులు కరాఖండిగా చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబుకు తోడుగా హీరో బాలకృష్ణ, తనయుడు నారా లోకేష్, హీరో తారక రత్న ప్రచారంలో దూసుకు పోతున్నారు. టిడిపిని గెలిపించేలని ఎవరికి వారు ప్రచారం చేస్తున్నారు.

వీరికి జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోడయ్యారు. టిడిపి, బిజెపి పొత్తు నేపథ్యంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల అనంతరం ఆయన సీమాంధ్రలోని ఆ కూటమికి ప్రచారం చేసే అవకాశముంది. పవన్ టిడిపికి మద్దతివ్వడం ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బిజెపితో పొత్తు నేపథ్యంలో నరేంద్ర మోడీ హవా కూడా కలిసి వస్తుందని చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారు.
దీంతో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం పైన వారెవరు దృష్టి సారించడం లేదు. పార్టీ నేతలు కూడా జూనియర్ ప్రచారం పైన ఆసక్తి కనబరుస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో... బాబు రాజకీయం ముందు జూనియర్ ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో పడ్డారని అంటున్నారు. ఎన్నికల టైంలో ఇలా మౌనంగా ఉండటం మంచిది కాదని జూనియర్‌కు పలువురు సూచనలు చేస్తున్నారట. అయితే ఏం చేయాలో తేల్చుకోలేని పరిస్థితుల్లో అతను ఉన్నారట. ప్రచారంపై జూనియర్ గురువారం ఓ ప్రకటన చేస్తారని ఊహాగానాలు వినిపించినా.. అది ఉత్కంఠగానే మిగిలింది.












Click it and Unblock the Notifications