ముఖ్యమంత్రా?.. ఉద్యమకారుడా?: కెసిఆర్‌పై ఏపి మంత్రి గంటా
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. తమ ప్రభుత్వానికి, అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏపి ఉన్నత విద్యామండలికి సంబంధించిన ఎస్‌బిహెచ్ ఖాతాలను తెలంగాణ ప్రభుత్వం స్తంభింపజేసిందని అన్నారు.
అంశంపై కోర్టును ఆశ్రయించి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితోపాటు బ్యాంకు వ్యవహార శైలిపై అక్కడే తేల్చుకుంటామని మంత్రి గంటా చెప్పారు. తమ శాఖ నిర్వహిస్తున్న ఖాతాను ఫ్రీజ్ చేసిన ఎస్‌బిహెచ్‌పై పరువు నష్టం దావా కూడా వేస్తామన్నారు.

ఫాస్ట్ పథకం అమలుపై తెలంగాణ సర్కారుకు కోర్టు చెంప పెట్టులా మారినా వారి వైఖరిలో మార్పు రాకపోవడం దురదృష్టకరమని గంటా అన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిలా కాకుండా ఉద్యమకారుడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
ఎంసెట్ పరీక్ష నిర్వహణపై ఫిబ్రవరి 2న జరిగే మంత్రి మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. యోగా క్లాసులకు తాము హాజరు కాలేకపోయామని, ప్రత్యేకంగా యోగా గురువు జగ్గీ వాసుదేవ్ ఆశ్రమాన్ని సందర్శించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications