పొలం పనులంటే ప్రేమ..వ్యవసాయ శాఖ ఖాయమా?
Recommended Video
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డి అప్పుడే పొలం పనుల్లో దిగిపోయారు. స్వయంగా ట్రాక్టర్‌ను నడిపిస్తూ పొలాన్ని దున్నుతూ కనిపించారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన జిల్లాలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌ను ఆయన ఓడించారు.
ఎమ్మెల్యేగా ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఈ లోగా- వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు ఆళ్ల రామకృష్ణా రెడ్డి. ఆయన కుటుంబానికి వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరు. మంగళగిరి శివార్లలో వారికి పొలం ఉంది. దాన్ని ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్వయంగా సాగు చేస్తుంటారు. న్యాయపరమైన అంశాలపై ఆయనకు మంచి పట్టు ఉంది. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని కీలక అంశాల్లో ఆయన న్యాయపోరాటం చేశారు.


వైఎస్ జగన్ సారథ్యంలో ఏర్పాటు కాబోయే కొత్త ప్రభుత్వంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డికి మంత్రి పదవి ఖాయం. ఎందుకంటే- ఆళ్ల రామకృష్ణా రెడ్డిని గెలిపించుకుంటే మంత్రిని చేస్తానని మంగళగిరిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా స్వయంగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆయనకు ఏ శాఖ ఇస్తారనే అంశంపై చర్చ నడుస్తోంది. పొలం పనులను చేసుకోవడం అంటే అమితంగా ఇష్టపడే ఆళ్లకు వ్యవసాయ శాఖ ఇస్తారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications