టిడిపి బెజవాడ ట్విస్ట్ వెనుక పవన్? బాలయ్యకు చిక్కు

హైదరాబాద్: కృష్ణా జిల్లా విజయవాడ లోకసభ నియోజకవర్గం అభ్యర్థి విషయంలో తెలుగుదేశం పార్టీలో గందరగోళానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణేనా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. విజయవాడకు టిడిపి ఇంఛార్జిగా చాలా రోజుల నుండి కేశినేని నాని ఉన్నారు. ఆయనకు లోకసభ టిక్కెట్ ఇస్తారని తొలి నుండి అందరూ భావించారు.

ఆయన కూడా అదే ఆశతో ఉన్నారు. అదే విజయవాడ లోకసభ పైన ఆశలు పెట్టుకున్న వల్లభనేని వంశీకి గన్నవరం ఇచ్చి పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు లోకసభ పోరు లేకుండా తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో కేశినేని నాని లోకసభకు టిడిపి - బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తారని గట్టిగా నమ్మారు.

Is Pawan behind Vijayawada TDP twist?

అయితే, హఠాత్తుగా ఈ టిక్కెట్‌ను కేశినేని నానికి కేటాయించడం లేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై చర్చించేందుకు కేశినేని నానిని చంద్రబాబు హైదరాబాదుకు రప్పించుకున్నారు. విజయవాడ లోకసభకు బదులు పెనమలూరు లేదా విజయవాడ తూర్పును తీసుకోవాలని అధినేత సూచించారు. అయితే, కేశినేని మాత్రం ససేమీరా అంటున్నారట.

చివరి నిమిషంలో బెజవాడ గందగోళం వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారని అంటున్నారు. పవన్ పార్టీ స్థాపన వెనుక ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ ఉన్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. విజయవాడ నుండి లోకసభకు పోటీ చేయాలని కంకణం కట్టుకున్న ఆయన ఏ పార్టీలో అవకాశం లేకపోవడంతో పవన్‌తో పార్టీ పెట్టించారనే రూమర్స్ వచ్చాయి.

ఇదిలా ఉండగా... పవన్ కళ్యాణ్ బిజెపి, టిడిపిలకు మద్దతిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ నుండి పోటీ చేయాలని గట్టిగా నిలబడిన పొట్లూరి.. పవన్ మద్దతుతో అక్కడి నుండే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పవన్ టిడిపి, బిజెపిలకి మద్దతిచ్చారు. కాంగ్రెసు వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో పవన్ మద్దతు బిజెపి, టిడిపికి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ అడిగిన ఒక్క సీటు ఇవ్వకుంటే అసలుకే మోసం వస్తుందని టిడిపి అధినేత భావిస్తున్నారని అంటున్నారు. పవన్ సిఫార్సు చేసిన పొట్లూరికి లోకసభ టిక్కెట్ ఇచ్చేందుకే చంద్రబాబు... కేశినేని నానిని హైదరాబాదుకు పిలిపించి తప్పుకోవాలని సూచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

బాలయ్య పోటీకి లెజెండ్ చిక్కు

హీరో, టిడిపి నేత బాలకృష్ణ లెజెండ్ సినిమాపై హిందూపురం ఎఫెక్ట్ పడింది! బాలకృష్ణను హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన తాజా సినిమా లెజెండ్ ప్రదర్శన నిలిపి వేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనంతపురం జిల్లా కలెక్టర్‌ను కోరారు. అయితే, బాలకృష్ణ టిడిపి అభ్యర్థి అని తమకు బి ఫారం అందాక ఈ ఫిర్యాదును పరిశీలిస్తామి జిల్లా కలెక్టర్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+