రూ.13కోట్లు తీసుకునే పవన్ ఆస్తులు రూ.17.77 కోట్లా?

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆస్తుల విలువ రూ.17.77 కోట్లుగా ఉందట. జనసేన పార్టీ స్థాపన నేపథ్యంలో పవన్ ఎన్నికల సంఘానికి తన ఆస్తులను వెల్లడించారు. అయితే, మొదట ఆయన ఆస్తి రూ.14.80 కోట్లుగా ఉన్నట్లు వచ్చింది. ఇప్పుడు మాత్రం రూ.17.77 కోట్లుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

పవన్ టాలీవుడ్లో టాప్ హీరో. ఒక్కో సినిమాకు ఆయన 13-15 కోట్ల రూపాయల వరకు తీసుకుంటారంటున్నారు. ఇటీవల ఓ నిర్మాణ సంస్థ ఆయనకు రూ.17 కోట్లు ఆఫర్ చేసినట్లుగా చెబుతున్నారు. అయితే, పవన్ ఈసికి వెల్లడించిన ఆస్తులు మాత్రం రూ.17.77 కోట్లుగా ఉందంటున్నారు. ఈసి వెబ్‌సైట్లో పవన్ ఆస్తుల వివరాలు ప్రస్తుతానికి లేవు. అధికారికంగా తెలియాల్సి ఉంది.

 Is Pawan Kalyan worth just Rs 17.77 Crores?

సమాచారం మేరకు... పవన్ వద్ద రూ.80,000 బంగారం, రూ.89,000 నగదు, తన భార్య అన్నా లెజ్నీవా పేరిట రూ.74,548, బ్యాంక్ డిపాజిట్స్ రూ.3,13,29,229, ఇతర డిపాజిట్స్ రూ.4,13,54,423, ఎల్ఐసి అండ్ పోస్టల్ డిపాజిట్స్ రూ.40,31,000 ఉన్నాయి.

బాండ్స్ అండ్ డిబెంచర్స్ రూ.4,55,207, మ్యుచువల్ ఫండ్స్ రూ.1,43,29,105, ఫైనాన్స్ కంపెనీల్లో రూ. 2,90,000, రెండు ద్విచక్ర వాహనాల ఖరీతు రూ.20,31,409, రెండు బెంజి కార్ల ఖరీదు రూ.1.86,79,149, స్కోడా కంపెనీ కారు రూ.27,67,208, ఇతరులకు ఇచ్చిన డబ్బులు రూ. 5,81,99,129, మిషనరీ విలువ రూ.23,58,863, ముగ్గురు పిల్లల పేర రూ.17,10,106 ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+