మెగాస్టార్ కాస్ట్లీ మిస్టేక్- సరిదిద్దుకోలేనంతగా..!!
అమరావతి: మెగాస్టార్ చిరంజీవి ఓ కాస్ట్లీ మిస్టేక్ చేశారు. దానికి తగిన మూల్యాన్నీ చెల్లించుకుంటోన్నట్టే కనిపిస్తోంది. భోళా శంకర్ డిజాస్టర్ తరువాత కొత్త సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. మెగా 157 సినిమాకు సైన్ చేశారు. బింబిసార ఫేమ్ వశిష్ట్ మల్లిడి దర్శకత్వం వహించనున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనుంది.
సోషియో ఫాంటసీగా థీమ్‌తో తెరకెక్కబోతోంది ఈ మూవీ. నవంబర్‌లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉండొచ్చు. దీనికి ఎంఎం కీరవాణీ సంగీతాన్ని అందించనున్నారు. చిరంజీవి-కళ్యాణ్ కృష్ణ కాంబోలో మరో సినిమా రాబోతోంది. చిరంజీవి కూతురు సుస్మిత నిర్మాతగా వ్యవహరించనున్నారు.

కాగా- గతంలో ఓ అద్భుతమైన ఆఫర్ చిరంజీవి చేతికి అందింది. అదే- ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్. స్పై థ్రిల్లర్ ఇది. ఈ సిరీస్ ఎంత హిట్ అయిందో ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్ పాత్ర కోసం క్రియేటర్లు రాజ్ అండ్ డీకే మొదట చిరంజీవినే అప్రోచ్ అయ్యారట.
ఇద్దరు పిల్లల తండ్రిగా నటించడానికి చిరంజీవి ఇష్టపడలేదని, స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని సూచించారు. దీనికి వారు అంగీకరించకపోవడంతో ఈ వెబ్ సిరీస్‌ను చిరంజీవి వదులుకున్నారు. దీనితో క్రియేటర్లు- మనోజ్ బాజ్‌పాయ్‌ను సంప్రదించారు. ఈ సిరీస్ తరువాత మనోజ్ బాజ్‌పాయ్ దశ తిరిగిపోయింది.
ది ఫ్యామిలీ మ్యాన్ మొదట చిరంజీవి వద్దకే వచ్చిందని ప్రముఖ నిర్మాత సీ అశ్వనీదత్ వెల్లడించారు. తొలుత సినిమాగా తెరకెక్కించాలని రాజ్ అండ్ డీకే ప్రయత్నించారని, ఈ స్క్రిప్ట్‌ను చిరంజీవి ఓకే చేయకపోవడంతో దాన్ని హిందీలో వెబ్ సిరీస్‌గా తీశారని అన్నారు. ఆ సినిమాను చిరంజీవి ఒప్పుకొని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications