నంద్యాలపై ఎస్పీవై రెడ్డికి జగన్ హామీ: శోభా అసంతృప్తి?

 Is Sobha Nagi Reddy unhappy with YS Jagan?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆ పార్టీకి చెందిన ఆళ్లగడ్డ శాసన సభ్యురాలు, సీనియర్ నేత భూమా నాగి రెడ్డిలు అసంతృప్తితో ఉన్నారా? అనే చర్చ సాగుతోంది. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డిలు గైర్హాజరయ్యారు.

వాళ్లు అసంతృప్తి కారణంగానే రాలేదనే అనుమానిస్తున్నారు. ప్రస్తుతం శోభా నాగి రెడ్డి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి అదే స్థానం ఆశిస్తున్నారు. భూమా నాగి రెడ్డి మాత్రం మొదటి నుంచి నంద్యాల ఎంపీ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు.

అయితే నంద్యాల సిట్టింగ్ ఎంపి ఎస్పీవై రెడ్డి ఇటీవలె వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ ఆయనకు ఇచ్చిన హామీ మేరకు తనకు నంద్యాల టికెట్ దక్కదని తెలియడంతో భూమా నాగి రెడ్డి పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే భూమా దంపతులు సోమవారం నాటి సభకు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే వారుమాత్రం వ్యక్తిగత పనుల వల్లనే సమావేశానికి రాలేదని వివరణ ఇచ్చారు.

కాగా, నిన్నటి భేటీకి గైర్హాజరైన వారిలో జగన్ సోదరి షర్మిల, బాబాయి వైవి సుబ్బారెడ్డి, భూమా దంపతులు, మైసూరా రెడ్డి తదితరులు ఉన్నారు. ఒంగోలు పార్లమెంటు టిక్కెట్‌ను వైవి సుబ్బారెడ్డి ఆశిస్తున్నారు. అయితే అక్కడ పోటీకి సురేష్ రెడ్డి అనే వ్యక్తిని జగన్‌కు సన్నిహితుడైన సునీల్ రెడ్డి తీసుకు వచ్చారట. ఈ కారణంగానే వైవి సుబ్బారెడ్డి అసంతృప్తితో ఉన్నారంటున్నారు.

ప్రాణాలిచ్చేందుకు సిద్ధం: భూమా నాగిరెడ్డి

తాను వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమని భూమా నాగి రెడ్డి అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్నది అవాస్తవమన్నారు. తనకు అధిష్టానం టిక్కెట్ ఇవ్వకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. జగన్‌తో ఎలాంటి విభేదాలు లేవన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+