అమరావతి ఎఫెక్ట్: పవన్ కళ్యాణ్‌పై రూటు మార్చిన టిడిపి

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన తెలుగుదేశం పార్టీ రూటు మార్చినట్లుగా కనిపిస్తోంది. రాజధాని కోసం భూసమీకరణ లేదా ఏపీకి ప్రత్యేక హోదా పైన టిడిపిని పవన్ ట్విట్టర్ ద్వారా పలుమార్లు ప్రశ్నించారు.

దీనిపై తెలుగుదేశం పార్టీ తొలి నుండి ఇప్పటి వరకు వేర్వేరుగా స్పందిస్తూ వస్తోన్నట్లుగా కనిపిస్తోంది. భూసమీకరణను రైతులు వ్యతిరేకిస్తున్నారని తెలిసి పవన్.. కొద్ది నెలల క్రితం రాజధాని ప్రాంతంలో పర్యటించారు. అప్పుడు తొలుత టిడిపి నేతలను ఆయన ఏకిపారేశారు.

అప్పుడు టిడిపి నేతలు స్పందించారు. ఆ సమయంలోనే టిడిపి - జనసేన పార్టీల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయని అందరు భావించారు. ఆ తర్వాత చంద్రబాబుతో భేటీ అయిన పవన్... రైతులను ఒప్పించి తీసుకోవచ్చునని చెప్పారు.

ప్రత్యేక హోదా విషయమై... పవన్ కళ్యాణ్ ట్వీట్ ద్వారా, విలేకరుల సమావేశంలో టిడిపి ఎంపీల పైన విరుచుకు పడ్డారు. ఆ సమయంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి, టిడిపి విజయవాడ ఎంపీ కేశినేని నాని గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇతర టీడీపీ నేతలు కూడా ఆయన పైన దుమ్మెత్తిపోశారు.

అయితే, పార్టీ అధినేత చంద్రబాబు సూచన మేరకు వారు ఆ తర్వాత తగ్గారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల ఆచితూచి స్పందించాలని, ఆయనతో విభేదాలు వద్దని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించినట్లుగా అప్పుడు వార్తలు వచ్చాయి. దీంతో టిడిపి నేతలు కాస్త తగ్గారు. ఆయన పట్ల కాస్త సున్నితంగా మాట్లాడారు.

Is TDP changes stand on Pawan Kalyan?

ఇటీవల పవన్ మళ్లీ భూసమీకరణ పైన వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. రైతుల నుంచి బలవంతంగా భూమిని సేకరించవద్దని ఆయన ట్వీట్ చేశారు. దీనిపై ఇటీవల మంత్రులు, ఇతర టిడిపి నేతలు బాగానే స్పందించారు. పవన్ చెప్పిందాంట్లో తప్పులేదని, ఆయన సూచన మేరకు నడుచుకుంటామన్నారు.

ఈ నెల 20వ తేదీ వరకు రైతులకు సమయం ఇస్తున్నట్లు మంత్రి నారాయణ ఇటీవల ప్రకటించారు. 20వ తేదీ తర్వాత భూసమీకరణ చేస్తామన్నారు. దానికి కౌంటర్‌గా పవన్ మళ్లీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. బలవంతంగా సేకరించవద్దని చంద్రబాబుకు హితవు పలికారు.

అయితే, భూసమీకరణ తేదీ దగ్గరకు రావడంతో టిడిపి నేతలు పవన్ కళ్యాణ్ పట్ల ఒకింత ఘాటుగానే స్పందిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం మాట్లాడుతూ.. భూసమీకరణ వద్దని చెబుతున్న పవన్.. ఏం చేయాలో ఆయనే చెప్పాలని కౌంటర్ ఇచ్చారు.

యనమల ఘాటు కౌంటర్ చర్చనీయాంశమవుతోంది. అయితే, చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉందంటున్నారు. గురువారం నుండి భూసమీకరణకు అవకాశముంది. ఈ నేపథ్యంలో పవన్ స్పందన, చంద్రబాబు ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+