కేసీఆర్ ప్లాన్: హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ బాబు, నితిన్!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబును నియమించే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది.

ఉమ్మడి రాష్ట్రం కన్నా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడిందనే విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల నేపథ్యంలో హైదరాబాద్ బ్రాండ్ వ్యాల్యూ పెంచేందుకు కేసీఆర్ తాజాగా మహేష్ బాబు వైపు దృష్టి సారించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Is Telangana considering Mahesh Babu naidu for Hyderabad Brand Ambassador?

హీరో నితిన్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరితో పాటు మరొకరిని కలిపి హైదరాబాదుకు బ్రాండ్ అంబాసిడర్ చేయాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. పేర్లను రెండు రోజుల్లో ఖరారు చేసే అవకాశముంది.

Is Telangana CM KCR considering Mahesh Babu for Hyderabad Brand Ambassador?

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా హైదరాబాద్‌కు చెందిన స్టార్ ప్లేయర్ సానియా మీర్జా ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ బాబు పేరు చర్చకు వస్తోందని ప్రచారం సాగుతోంది. అయితే, ఇది ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలకు సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు దీనిని అంగీకరిస్తారా అనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+