సునీల్ ని అడిగిన ప్రశ్నే.. ఆ వారసులను అడగ్గలరా?
హైదరాబాద్ : ఛానెల్ కొక ట్యాగ్ లైన్ తో ఈమధ్య కాలంలో తెలుగు మీడియా పరిధి చాలా వేగంగా విస్తరించిన విషయం తెలిసిందే. దీంతో పోటీ వాతావరణం కూడా అదే స్థాయిలో పెరగడంతో.. వీక్షకులను తమ ఛానెల్ కే కట్టిపడేయాలన్న ఆతృతతో ఆయా ఛానెళ్లు నిర్మొహమాటంగా వ్యవహరిస్తున్నాయి.
బరి తెగింపు అనుకున్నా సరే..! సెన్సేషన్ కోసం తాపత్రయం అనుకున్నా సరే..! టీఆర్పీ నే టార్గెట్ గా కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. రాజకీయాలకు, సినీ గ్లామర్ కు మసాలా ప్రశ్నలు దట్టించి తెర మీదకు వదులుతున్నాయి.
సెలబ్రిటీ గాసిప్స్ కు ఉన్న రీడర్ షిప్ దృష్ట్యా..! పాపులర్ పర్సనాలిటీలను ఇంటర్వ్యూలు చేయడం.. అందులో అర్థం పర్థంలేని గాసిప్స్ కు ప్రాధాన్యత కల్పించడం పరిపాటిగా మారిపోయింది. టీవీలో చూసే జనాలకే ఆ ప్రశ్నలు ఎబ్బెట్టుగా ఉంటే.. ఇంకా ఇంటర్వ్యూలో పాల్గొన్నవాళ్లు సైతం 'ఎందుకొచ్చాంరా ఈ షో కి..'అనుకోవడంలో అతిశయోక్తి లేదేమో. అంతలా చిరాకు తెప్పించే ప్రశ్నలుంటాయి మరి అందులో.

దీనికి తాజా ఉదాహరణ సునీల్ ఇంటర్వ్యూ. సదరు ఛానెల్ యాంకర్ సునీల్ ను ఇంటర్యూ చేస్తూ.. 'మీకు హీరో ఫీచర్లు ఉన్నాయని ఫీలవుతున్నారా..? అసలు అద్దంలో మొహం చూసుకున్నప్పుడు, హీరోగా మీరు ఫిట్ అని ఎప్పుడైనా అనిపించిందా..? సునీల్ వర్మ కాకపోయుంటే అసలు ఇండస్ట్రీలో నెగ్గుకొచ్చేవారా?' అన్న తరహాలో ప్రశ్నల వర్షం గుప్పించారు.
అయితే అందరికీ సమదృష్టితో ప్రశ్నలు వేసే తత్వమే గనుక ఆ ఛానెల్ కు ఉంటే..! 'ముక్కు మొహాం సరిగా లేకున్నా హీరోలుగా చలామణి అవుతున్నవాళ్లను.. బలవంతంగా జనం మీదికి హీరోలుగా రుద్దబడుతున్న కొంతమంది వారసులను..' ఇదే ప్రశ్నలు వేయగలదా..? అన్నది సునీల్ ఇంటర్వ్యూ తర్వాత ప్రతీ ఒక్కరిలో మెదులుతోన్న ప్రశ్న.
అంతకుముందు.. రోజా విషయంలోను, టీడీపీ నేత ఆనం విషయంలోను ఇలాగే వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రశ్నలు అడిగి సదరు యాంకర్ అందరి చేత విమర్శలపాలయిన విషయం తెలిసిందే. చూడాలి మరి.. సంచలనం కోసం ఆ ఛానెల్ చేసే ప్రయత్నాల్లో ముందు ముందు మరెన్ని ఘోరాలు వినాల్సి వస్తుందో?
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications