తెరాస సమైక్యవాద పార్టీనా, బాబు గజినీ: అంబటి

విభజన బిల్లు శానససభకు వస్తే అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పిన నేతలు ఇప్పుడు ఆ పని ఎందుకు చేయడం లేదని ఆయన అడిగారు. విభజన బిల్లు ప్రతులను భోగి మంటల్లో వేసి తగులబెట్టాలని ఎపిఎన్జీవోల నేతలు అంటున్నారని, అటువంటప్పుడు బిల్లుపై చర్చను ఎలా అంగీకరిస్తారని ఆయన అన్నారు.
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కలిసి తమ పార్టీపై విషప్రచారం సాగిస్తున్నాయని ఆయన విమర్శించారు. సమైక్యవాదం వినిపిస్తున్న అసలు సిసలైన పార్టీ తమదేనని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు సమైక్యంపై చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కలిసి కుయుక్త రాజకీయాలకు పాల్పడుతున్నాయని అన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ప్రయత్నించడం మానేసి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కొత్త నాటకానికి తెర లేపుతున్నాయని ఆయన అన్నారు. సమైక్య నినాదం వినిపించిన తమ పార్టీ శాసనసభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కలిసి విభజనకు సహకరించడానికే తమ పార్టీ శాసనసభ్యులపై వేటు వేశారని ఆయన అన్నారు. తమ పార్టీ సమైక్యం బాటలోనే నడుస్తుందని అంబటి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications