జగన్‌లో పవన్ కళ్యాణ్ భయం: కొత్త విషయం చెప్పిన సోమిరెడ్డి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కాపీ కొడుతున్నారా? అంటే అవుననే అంటున్నారు టిడిపి నేతలు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కాపీ కొడుతున్నారా? అంటే అవుననే అంటున్నారు టిడిపి నేతలు.
టిడిపి నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం నాడు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌ను జగన్ కాపీ కొడుతున్నారని ఆక్షేపించారు.
పవన్ ప్రతిపక్ష పాత్రలో సక్సెస్ అవుతారని జగన్ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతగా జగన్ పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. ఉద్దానం కిడ్నీలు, చేనేత కార్మికుల సమస్య, యువభేరీలే ఇందుకు నిదర్శనం అన్నారు. ఉద్యోగ వ్యవస్థను వైసిపి అప్రతిష్ట పాలు చేస్తోందన్నారు.

జగన్ మానసిక ఆందోళనలతో తప్పుల మీద తప్పులు చేస్తున్నారన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు వైసిపి అడ్డంకిగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రానికి జరిగిన నష్టంలో మాజీ సీఎస్ రమాకాంత్ పాత్ర ఉందన్నారు.
కొత్త విషయం చెప్పిన సోమిరెడ్డి
ప్రతిపక్ష పాత్రలో పవన్ సక్సెస్ అవుతారని జగన్ భయపడుతున్నారని సోమిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల ద్వారా పవన్‌ను టిడిపి ప్రతిపక్షంగా చూస్తున్నట్లుగా అర్థమవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. తద్వారా పవన్ తమకు దూరం జరిగారని ఆయన భావించినట్లుగా కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ లేవనెత్తిన పలు సమస్యల పైన తెలుగుదేశం పార్టీ సానుకూలంగా స్పందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే, ఇటీవల కొంత దూరం పెరిగినట్లుగా కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు కూడా ఆయనను మిత్రపక్షంగా చెప్పలేకపోయారు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా పవన్ తనకు పోటీకి వస్తారని జగన్ భావిస్తున్నారని విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications