జగన్ ప్లాన్ పారేనా: బిజెపితో ఉండలేకా, విడిపోలేక చంద్రబాబు...

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందా, లేదా అనే విషయంలో కొత్తగా తేలాల్సింది ఏమీ లేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టంగానే చెప్పింది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో చేసిన ప్రకటన కూడా అదే. ప్రత్యేక హోదా అవసరం లేదని చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న బిజెపి నేత మాణిక్యాల రావు తాజాగా గురువారంనాడు చెప్పారు.

ఎపికి ప్రత్యేక హోదా రాదని విషయం చంద్రబాబుకే కాదు, వైఎస్ జగన్‌కు కూడా తెలుసు. కానీ దాన్నే జగన్ ఆస్త్రంగా ప్రయోగిస్తున్నారు. చంద్రబాబును చిక్కుల్లో పడేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. జగన్ తనను కార్నర్ చేస్తున్నారని ఇటీవల చంద్రబాబు కూడా అన్నారు. నిజానికి, జగన్ లక్ష్యమే అది. బిజెపితో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకునే విధంగా ఒత్తిడి తేవడమే ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

అయితే, చంద్రబాబు మాత్రం తెగదెంపులు చేసుకునే విషయంలో సతమతమవుతున్నారు. పార్లమెంటు సభ్యులు పలువురు బిజెపితో విడిపోదామని సూచించినప్పటికీ ఆయన వినడం లేదు. అందుకు జగన్ చెప్పిన కారణాలు ఏమైనా కావచ్చు గానీ బిజెపితో విడిపోతే రాజకీయంగా ఆయన తీవ్రంగా నష్టపోయే ప్రమాదం మాత్రం ఉంది. తనంత తానుగా బిజెపిని దూరం చేసుకుంటే కేంద్రం నుంచి ఈ మాత్రం సాయం కూడా అందకపోవచ్చు.

Is YS Jagan plan success on Special category status to AP

చంద్రబాబు కూడా అదే కారణం చెబుతున్నారు. బిజెపితో తెగదెంపులు చేసుకుంటే కేంద్రం నుంచి తగిన సహాయాన్ని రాబట్టలేమని ఆయన చెబుతూ వస్తున్నారు. కానీ, ప్రత్యేకహోదాపై కేంద్రంపై విమర్శలు చేయడానికి తన పార్టీ పార్లమెంటు సభ్యులకు, నాయకులకు స్వేచ్ఛనిచ్చారు. దాంతో వారు కేంద్రంపై తీవ్రమైన విమర్శలే చేశారు.

కానీ, ఆ విమర్శలు బిజెపి, టిడిపిల బంధాన్ని తెంచేంత తీవ్ర స్థాయిలో లేవు. అయితే, జగన్ మాత్రం ఇరు పార్టీల బంధం తెగిపోవాలని, అలా తెంచుకునేలా చంద్రబాబుపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. గురువారంనాడు నిర్వహించిన నెల్లూరు యువభేరీ కార్యక్రమం కూడా అందులో భాగమే.

బిజెపితో తెగదెంపులు చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు చిక్కులు తప్పకపోవచ్చు. ఎపిలో మరో రాజకీయ పార్టీ పొత్తు కోసం బిజెపి ప్రయత్నించే అవకాశం ఉంది. ఆ మరో పార్టీ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తప్ప మరోటి ఉండకపోవచ్చు. పవన్ కల్యాణ్ వస్తే ఎలా ఉంటుందనేది చెప్పలేం గానీ ఇప్పటికిప్పుడైతే జగనే బిజెపికి సరైన జోడీగా కనిపించవచ్చు. అందువల్లనే చంద్రబాబు బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధంగా లేరని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+