వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తండ్రి జ్ఞాప‌కం! ప్ర‌మాణ స్వీకారంలో వైఎస్ జ‌గ‌న్‌లో స‌రికొత్త మార్పు!

|
Google Oneindia TeluguNews

విజ‌య‌వాడ‌: ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిలో ఓ స‌రికొత్త మార్పు క‌నిపించింది. ఆ మార్పు ఇంత‌కుముందు ఎప్పుడూ లేదు. అదే- వాచీ. త‌న తండ్రి, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి చెందిన వాచిగా చెబుతున్నారు స‌న్నిహితులు. త‌న తండ్రి జ్ఞాప‌కంగా వైఎస్ జ‌గన్ ప్ర‌మాణ స్వీకారం రోజు ధ‌రించార‌ని అంటున్నారు. ముఖ్య‌మంత్రిగా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎప్పుడూ వాచీతో క‌నిపించే వారు.

<strong>టీమిండియా స్ఫూర్తితో ప‌నిచేయండి: వైఎస్ జ‌గ‌న్‌కు ఆ ఇద్ద‌రి శుభాకాంక్ష‌లు</strong>టీమిండియా స్ఫూర్తితో ప‌నిచేయండి: వైఎస్ జ‌గ‌న్‌కు ఆ ఇద్ద‌రి శుభాకాంక్ష‌లు

దాన్నే ఇప్పుడు ఆయ‌న ధ‌రించారు. వైఎస్ జ‌గ‌న్ త‌న చేతికి ఎప్పుడూ వాచి ధ‌రించిన సంద‌ర్భాలు లేనే లేవు. ప్ర‌తిప‌క్ష నేత‌గా స‌భ‌లో క‌నిపించిన‌ప్పుడు గానీ, ప్ర‌త్యేక హోదా డిమాండ్ సాధ‌న కోసం దీక్ష‌లు చేప‌ట్టిన‌ప్పుడు గానీ, సుదీర్ఘ పాద‌యాత్ర‌లో గానీ ఈ వాచీ వైఎస్ జ‌గ‌న్ చేతికి ఉండేది కాదు.

Is YS Jagan wearing his fathers wrist watch?

అస‌లు ఆయ‌న‌కు చేతికి వాచీ ధ‌రించే అల‌వాటు లేద‌ని స‌న్నిహిత నాయ‌కులు చెబుతుంటారు. అలాంటిది- ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న సంద‌ర్భంగా దాన్ని ధ‌రించారు. ఆ వాచీ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిద‌ని తెలుస్తోంది.

English summary
Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy has wearing a Wrist watch on the occasion of oath taking ceremony as Chief Minister. This is the first that, YS Jagan wearing a Wrist watch like his Father deceased Chief Minister of Andhra Pradesh YS Raja Sekhar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X