Aditya L1: చారిత్రక ఘట్టానికి కౌంట్‌డౌన్ షురూ: శ్రీహరికోట చిరస్థాయిగా..
తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన పని తాను చేసుకోవడాన్ని మొదలు పెట్టింది.
ఈ విజయం ఇచ్చిన ఊపుతో మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోంది ఇస్రో. సూర్యుడిపై ప్రయోగాలకు సన్నద్ధమైంది. దీనికోసం ఆదిత్య ఎల్ 1 ప్రాజెక్ట్‌ను చేపట్టింది. సెప్టెంబర్ 2వ తేదీన అంటే శనివారం ఉదయం 11:50 నిమిషాలకు ఆదిత్య ఎల్ 1 శాటిలైట్.. సూర్యుడి వైపు దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది.

దీన్ని మోసుకెళ్లడానికి పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్‌ను వినియోగించనుంది ఇస్రో. ప్రయోగించిన రోజు నుంచి ఈ శాటిలైట్ సూర్యుడి దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. 110 నుంచి 120 రోజుల తరువాత ఎల్1కు చేరుకుంటుంది. దీనికి సంబంధించిన తుదిదశ కసరత్తు పూర్తయినట్లు ఇస్రో తెలిపింది.
తాజాగా ఈ ఆదిత్య ఎల్1 ప్రయోగానికి కొద్దిసేపటి కిందటే కౌంట్‌డౌన్ ఆరంభమైనట్లు ఇస్రో ప్రకటించింది. లాంచింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయినట్లు పేర్కొంది. లాంచింగ్ రిహార్సల్స్‌ను ఇదివరకే ముగిశాయని, అన్నీ సజావుగా ఉన్నాయని వివరించింది. పీఎస్ఎల్వీ సీ57 పనితీరు, ఇతర యంత్ర సామాగ్రి, డేటా కనెక్షన్స్, కంట్రోల్ రూమ్‌తో లింకేజ్ వ్యవస్థ.. వంటి కీలక విభాగాలు సంతృప్తికరంగా ఉన్నట్లు పేర్కొంది.
మొత్తంగా ఏడు పేలోడ్స్‌ను తన వెంట మోసుకెళ్తుంది పీఎస్ఎల్వీ శాటిలైట్. రిమోట్ సెన్సింగ్ పేలోడ్స్ కేటగిరీలో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరొనోగ్రాఫ్, సోలార్ అల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, సోలార్ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ ఉంటాయి. ఇన్-సైటు పేలోడ్స్ కేటగిరీలో హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్యను ఈ శాటిలైట్ తీసుకెళ్తుంది.
ఈ ప్రయోగంతో తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం పేరు ఇక చిరస్థాయిగా నిలిచిపోతుంది. దీనికి కారణాలు లేకపోలేదు. సూర్యుడిపై అధ్యయనం చేయబోతోన్న మొట్టమొదటి అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోనే కావడం, ఆ సంస్థ లాంచింగ్ కార్యకలాపాలన్నింటినీ శ్రీహరికోటే ప్రధాన కేంద్రం కావడం దీనికి కారణం.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications