నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్ - 29.. గజ ఎఫెక్ట్ నిల్
Recommended Video

నెల్లూరు : నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ సెంటర్ నుంచి ప్రయోగించిన జీశాట్ - 29 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది. జీఎస్ఎల్వీ మార్క్ III డీ 2 రాకెట్ ద్వారా స్పేస్ లోకి ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. అనుకున్న ప్రకారమే బుధవారం సాయంత్రం 5 గంటల 8 నిమిషాలకు గగనతలంలోకి పంపించారు. మంగళవారం మధ్యాహ్నం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అయితే గజ తుపాను కారణంగా జీశాట్ - 29 ప్రయోగానికి ఆటంకం ఏర్పడుతుందేమోనని భావించారు. చివరకు ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో ఈ ప్రయోగం విజయవంతమైంది.

3423 కిలో బరువున్న ఉపగ్రహాలను జీశాట్ - 29 మోసుకెళ్లింది. ఎస్200 బూస్టర్ ద్వారా ఈ ప్రయోగాన్ని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు ఇస్రో సైంటిస్టులు. ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా జీశాట్ - 29కు రూపకల్పన జరిగింది. దీంట్లో కేయూ, కేఏ బ్యాండ్ పేలోడ్స్ ఉన్నాయి. జీశాట్ - 29 ద్వారా స్పేస్ టెక్నాలజీపై సరికొత్తగా అధ్యయనం చేయనున్నారు.
📡LIVE Now: Launch of GSLV Mk-III D2/ GSAT-29 Mission from Satish Dhawan Space Centre (SHAR), Sriharikota https://t.co/nIwBVLhaBx
— PIB India (@PIB_India) November 14, 2018
అంతేగాకుండా కమ్యూనికేషన్ సేవలు మరింత మెరుగుపడనున్నాయి. జీశాట్ విభాగంలో మూడు ఉపగ్రహాలు పంపేలా ప్రణాళిక రూపొందించింది ఇస్రో. ఇప్పటికే జీశాట్ - 19 ఉపగ్రహన్ని 2017 జూన్ లో స్పేస్ లోకి పంపించారు. ఇప్పుడు జీశాట్ - 29 ని కూడా సక్సెస్ ఫుల్ గా పంపించారు. మరో ఉపగ్రహమైన జీశాట్ - 11 ను వచ్చే నెల 4న యూరోపియన్ స్పేస్ పోర్టు నుంచి పంపేలా సన్నాహాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications