Gaganyaan: టేకాఫ్‌కు చివరి అయిదు సెకెన్ల ముందు.. అనూహ్యం: తొలి ఎదురుదెబ్బ

తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో చేపట్టిన గగన్‌యాన్ చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్1 మిషన్లను విజయవంతం చేసింది ఇస్రో. ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 శాటిలైట్‌ను అంతరిక్ష ప్రయాణం సజావుగా సాగుతోంది. త్వరలో అది లాగ్రాంజ్ పాయింట్‌ను చేరుకోనుంది.

ఇస్రో అంతరిక్ష ప్రయోగాలు ఈ రెండింటి వద్దే ఆగట్లేదు. మరో సంచలన మిషన్‌ను తెర మీదికి తీసుకొచ్చింది. అదే- గగన్‌యాన్. మానవ సహిత ప్రయోగం ఇది. మనుషులను అంతరిక్షంలోకి పంపించడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్. 2024 మార్చి నాటికి ఇది కార్యరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది.

ISROs Gaganyaan First Flight Test on hold

ఈ మిషన్ తొలి ప్రయత్నం విఫలమైంది. అందరూ ఆశించినట్టుగా ఈ ప్రయోగం కార్యరూపం దాల్చలేకపోయింది. క్రూ మాడ్యుల్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లాల్సిన రాకెట్..అనూహ్యంగా పైకి ఎగరలేకపోయింది. సాంకేతిక వైఫల్యమే దీనికి కారణమని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమ్‌నాథ్ ప్రకటించారు.

తాత్కాలికంగా గగన్‌‌యాన్‌ టెస్ట్ ఫ్లైట్ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించారు. తొలి ప్రయోగం విఫలం కావడానికి గల కారణాలను విశ్లేషిస్తోన్నామని, డేటాను సేకరిస్తోన్నామని అన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెల్లడిస్తామని సోమ్‌నాథ్ తెలిపారు.

నిజానికి- క్రూ మాడ్యుల్‌ను మోసుకుంటూ తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి.. ఈ ఉదయం 8 గంటలకు ఈ రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లాల్సి ఉంది. సాంకేతిక లోపాలు తలెత్తడంతో దాన్ని 8: 30 గంటలకు వాయిదా వేశారు. క్రూ మాడ్యుల్ సేఫ్టీకి సంబంధించిన కొన్ని చిన్నపాటి లోపాలు కనిపించాయి.

దీనితో మళ్లీ 15 నిమిషాలు వాయిదా వేశారు. 8:45 నిమిషాలకు రాకెట్ ప్రయోగాన్ని చేపట్టారు. అప్పుడు కూడా రాకెట్ ప్రయోగం విఫలమైంది. కౌంట్ డౌన్ ముగియడానికి చివరి అయిదు సెకెన్ల వద్ద ప్రయోగాన్ని నిలిపివేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+