Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇంత అలసత్వమా?: ఏపీకి కొత్తగా తేల్చిందేంటి.. మళ్లీ తుస్సుమనిపించిన కేంద్రం

Recommended Video

    Arun Jaitley Again Disappointed AP

    న్యూఢిల్లీ: కచ్చితంగా చేసి తీరితే తప్ప.. 'చేస్తాం.. చూస్తాం' అన్న కేంద్రం మాటలకు ఎప్పుడో గడువు దాటిపోయింది. ఏపీ ప్రజలంతా ఢిల్లీకి చేరి మరీ హోదా కోసం నినదిస్తున్నవేళ.. మళ్లీ పాత పాటే పాడి ఏపీతో పరాష్కం ఆడుతున్నట్టే కనిపిస్తోంది కేంద్రం. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల భేటీ తర్వాత వచ్చిన ప్రకటన వింటే ఇదే అభిప్రాయం కలగకమానదు.

    ఏకాభిప్రాయం కుదరలేదా?:

    ఏకాభిప్రాయం కుదరలేదా?:

    హోదాకు సమానమైన ప్యాకేజీని ఇస్తామని కేంద్రం చెబుతున్న మాట పాతదే. తాజా భేటీ అనంతరం కూడా.. ఇదేదో కొత్తగా తీర్మానించేసినట్టు బీజేపీ నేతలు మళ్లీ అదే మాట చెప్పారు. మరోవైపు యనమల రామకృష్ణుడు మాత్రం ప్రత్యేక హోదా కావాల్సిందేనని పట్టుబట్టినట్టు చెబుతున్నారు.

    లేదంటే రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని కూడా జైట్లీతో చెప్పినట్టు పేర్కొన్నారు. అంటే, ఇరువురి మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

    కాలయాపనకేనా చర్చలు?:

    కాలయాపనకేనా చర్చలు?:


    ప్యాకేజీ నిధుల విషయంలో కేంద్రం వహించిన అలసత్వ ధోరణి.. ఇప్పుడు టీడీపీ మళ్లీ హోదా గళాన్ని ఎత్తుకొనేదాకా తీసుకొచ్చింది. అయినా సరే కేంద్రం వైఖరిలో ఎలాంటి మార్పు వచ్చినట్టు కనిపించడం లేదు.

    న్యాయపరమైన హక్కులు, రెవెన్యూ లోటు వంటి విషయాలపై మరోసారి సమావేశమై చర్చిద్దామని జైట్లీ చెప్పినట్టు చెబుతున్నారు. దీంతో ఇంకెన్నాళ్లు ఇలా చర్చలతోనే కాలయాపన చేస్తారన్న అసహనం రాష్ట్రంలో వ్యక్తమవుతోంది.

    ఏపీ అంటే అలసత్వమా?:

    ఏపీ అంటే అలసత్వమా?:

    సమావేశాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షానే భేటీకి డుమ్మా కొట్టడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ అంటే అంత పట్టిలేని తనం ఉండబట్టే ఆయన భేటీకి డుమ్మా కొట్టారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    కొత్తగా ఏం తేల్చినట్టు?:

    కొత్తగా ఏం తేల్చినట్టు?:

    మొత్తంగా ఈ భేటీ ద్వారా చర్చను మరో భేటీకి సాగదీశారు తప్పితే కొత్తగా తేల్చింది కానీ సాధించింది కానీ ఏమి లేదనే విషయం స్పష్టమవుతోంది. హోదా మాటెత్తకుండా ఉండటానికి కేంద్రం టీడీపీ నేతలకు మరోసారి ప్యాకేజీ తాయిలాల గురించి చెప్పి మురిపించినట్టుంది తప్పితే.. ఈ భేటీలో ఇంకేమి కనిపించడం లేదు. ఇదే వైఖరి ఇకముందు కూడా కొనసాగితే.. బీజేపీ తనంట తాను తెగేదాకా తెచ్చుకున్నట్టే అంటున్నారు ప్రజలు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+