ఉగ్రవాద ముప్పు: టెర్రర్ సర్ఫింగ్ చేస్తున్నారా? ఐటి ఉద్యోగులపై నిఘా
హైదరాబాద్: ఇటీవల సంభవించిన పరిణామాల నేపథ్యంలో ఉద్యోగుల సర్ఫింగ్ అలాట్లపై నిఘా పెట్టాలని సైబరాబాద్ పోలీసు అధికారులు ఐటి కంపెనీలకు సూచించారు. ఉగ్రవాదానికి సంబంధించిన సమాచారాన్ని వారు సెర్చ్ చేస్తున్నారా అనే విషయంపై నిఘా పెట్టాలని సూచించారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ఐటి కంపెనీలకు మార్గదర్శకాలను పంపినట్లు తెలుస్తోంది. పలువురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఇరాక్, సిరియాలకు చెందిన ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరులుగా మారుతున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేయడానికి చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఐటి కంపెనీల ఉన్నతాధికారులతో సైబరాబాద్ పోలీసు అధికారులు గత వారంలో రెండు సార్లు సమావేశమైనట్లు చెబుతున్నారు. దాడులు, నిర్బంధం వంటి ఉగ్రవాద సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ సాగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని ఐటి కంపెనీలు తమ ఉద్యోగులకు సోషల్ నెట్‌వర్క్ సైట్ల యాక్సెస్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. వాటిపై ఆంక్షలు విధించాయి.

ఇరాక్, సిరియా, పాకిస్తాన్, ఇతర ఉగ్రవాద దేశాలకు సంబంధించిన సోషల్ నెట్‌వర్కింగ్ గ్రూపులకు యాక్సెస్ లేకుండా చర్యలు తీసుకుంటున్నాయి. కార్యాలయాల్లో అటువంటి సోషల్ నెట్‌వర్కింగ్ గ్రూపులకు యాక్సెస్ లేకుండా చూడాలని పోలీసు అధికారులకు ఐటి కంపెనీలకు సూచించారు. ఉద్యోగుల్లో ఎవరిమీదనైనా అనుమానం కలిగితే తమకు సమాచారం అందించాలని ఐటి కంపెనీల యజమానులకు సైబరాబాద్ పోలీసులు సూచించారు.
ఐటి కంపెనీలు ఇంటర్నెట్ సెక్యూరిటీ ఫీచర్స్‌ను, రిమోట్ సెన్సింగ్‌ను పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. మౌఖికంగా సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులకు ఐటి కంపెనీల యజమానులకు చెప్పినట్లు సమాచారం. పోలీసు ఉన్నతాధికారులు పలు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ను సూచించారు. ఐటి కారిడార్‌లో పోలీసులు ఇప్పటికే సాయుధ భద్రతను పెంచారు. అనధికార వ్యక్తులను ఆవరణల్లోకి అనుమతించవద్దని, వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications