సంప్రదాయం కాదు: వైఎస్ ఫోటోపై మంత్రి యనమల ట్విస్ట్
హైదరాబాద్: శాసనసభ లాంజ్‌లో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటోపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ట్విస్ట్ ఇచ్చారు. శాసనసభలో మాజీ ముఖ్యమంత్రుల ఫొటోలు పెట్టడం సంప్రదాయం కాదని ఆయన అన్నారు .సంప్రదాయానికి విరుద్ధంగా శాసనసభ ఆవరణలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఫొటో పెట్టారని ఆయన అభిప్రాయపడ్డారు.
అసెంబ్లీ లాంజ్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాన్ని యథావిధిగా ఉంచాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, స్పీకర్ కోడెల శివప్రసాద రావుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రాసిన బహిరంగ లేఖపై ఆయన శనివారంనాడు ప్రతిస్పందించారు.

అసెంబ్లీలో స్పీకర్ల చిత్రపటాలు ఉంచాల్సిన చోటు ముఖ్యమంత్రి సతీమణి ఫొటో ఉంచడం ఏ విధమైన సంప్రదాయమని ఆయన అడిగారు. ఫొటోల తొలగింపు వ్యవహారం సభాపతి పరిధిలో ఉందని, దీనిపై ప్రభుత్వానికి సంబంధం లేదని ఆయన అన్నారు.
ప్రతి విషయాన్నీ రాజకీయం చేయడం జగన్‌కు అలవాటుగా మారిందని ఆయన అంటూ ఆ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. కాగా, అసెంబ్లీ లాంజ్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాన్ని కొద్ది రోజుల క్రితం తొలగించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications