Posani: నువ్వు హీరో అయితే ఏంటి.. రాత్రి 9 గంటలకు పవన్ కు పోసాని వార్నింగ్..!
పోసాని కృష్ణ మురళి గబ్బర్ సింగ్ మూవీ షూటింగ్ సందర్భంగా పవన్ కల్యాణ్ తో జరిగిన ఓ ఘటనను మీడియాకు వివరించారు. గబ్బర్ సింగ్ సినిమా కోసం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు టై ఇచ్చినట్లు చెప్పారు. అయినా పవన్ కల్యాణ రాకపోయేసరికి ఇంటికి వెళ్లినట్లు పోసాని చెప్పారు. తను ఇంటికెళ్లి భోజనం చేస్తుండుగా పవన్ కల్యాణ్ ఫోన్ చేశాడని చెప్పాడు. చెప్పు పవన్ అన్నాను. మేం పిచ్చోళ్లమా అంటూ షూటింగ్ సమయంలో మీరు ఉండాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
"నా భార్యకు ఆపరేషన్ అయింది.ఈ విషయాన్ని దర్శకుడికి చెప్పాను. అందుకే ఇంటికి వచ్చాను. రేపు ఇంటికి మాట్లాడుకుందాం. నువ్వు హీరో అయితే ఏంటి అని గట్టిగా అన్న" అని పోసాని కృష్ణ మురళి చెప్పారు. సాధారణంగా తాను మూవీ షూటింగ్ కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకు సమయం ఇస్తానని చెప్పారు. దర్శకుడు విజ్ఞప్తి చేస్తే రాత్రి 9 గంటల వరకు ఉంటానని చెప్పారు. తనకు ఎక్కువ చేస్తే కుదరని చెప్పినట్లు వివరించాడు.

తనతో పొగరుగా మాట్లాడితే కుదరని చెప్పారు. పవన్ కల్యాణ్ ను రాజకీయంగా పరంగా వ్యతిరేకిస్తే తనకు సినిమాలు పోలేదన్నారు. తెలుగు పరిశ్రమ మొత్తం మెగా ఫ్యామిలీ ఉంటే మూవీ అర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మోహన్ బాబు ఎందుకు గెలిచాడని పోసాని అన్నారు. మెగా ఫ్యామిలీ పవర్ ఉన్న వారు అయితే ఎన్నికల్లో చిరంజీవి రాజకీయాల్లో ఎందుకు ఓడిపోయారని పోసాని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ కు సంబంధించిన వారు తన ఫోన్ బూతు సందేశాలు పంపించారని. ఇది చాలా ఘోరమని పోసాని అన్నారు. పవన్ పార్టీ పెట్టినప్పుడు తానే మొదటగా అభినందించినట్లు పోసాని కృష్ణ మురళి చెప్పారు. తనకు సినిమాలో అవకాశం రాకుంటే చేస్తే సంకలో వెంట్రుక కూడా పీకలేరని పోసాని అన్నారు.












Click it and Unblock the Notifications