Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీ మరో్ నేత ఇంట్లో ఐటీ సోదాలు ! నెక్ట్స్ ఎవరూ టీడీపీ నేతల్లో కలవరం !

ఎన్నిక‌ల వేళ‌..ఐటి అధికారుల దాడులు క‌ల‌క‌లం రేపుతున్నాయి. టిడిపి అభ్య‌ర్దిగా ఎన్నిక‌ల్లో క‌డ‌ప జిల్లా మైదుకూరు నుండి పోటీ చేస్తున్న టిటిడి చైర్మ‌న్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ పై ఐటి దాడులు జ‌రుగుతున్నాయి. ఆయ‌న పోల‌వ‌రం లో స‌బ్ కాంట్రాక్ట‌ర్ గా ఉండ‌టంతో పాటుగా ప‌లు నిర్మాణాల‌కు కాంట్రాక్ట‌ర్ గా ఉన్నారు. ఏపి - తెలంగాణ మంత్రులు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు..త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ ల‌కు పుట్టా వియ్యంకుడు.

పుట్టా నివాసం లో ఐటి సోదాలు..

పుట్టా నివాసం లో ఐటి సోదాలు..

క‌డ‌ప జిల్లాలో ఐటి దాడులు క‌ల‌క‌లం రేపుతున్నాయి. క‌డ‌ప జిల్లా మైదుకూరు టిడిపి అభ్య‌ర్దిగా పోటీలో ఉన్న పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ నివాసంలో ఆక‌స్మికంగా ఐటి అధికారులు సోదాలు చేసారు. ఎన్నిక‌ల జ‌రుగుతున్న వేళ‌..ప్ర‌చారం లో ఉన్న సుధాక‌ర్ యాద‌వ్ నివాసం పై ఐటి దాడుల వ్య‌వ‌హారం టిడిపి నేత‌ల్లో క‌ల‌వ‌రానికి కార‌ణ‌మైంది. పుట్టా సుధా క‌ర్ యాద‌వ్ ఏపి - తెలంగాణ ల్లో పెద్ద నిర్మాణాల కాంట్రాక్టులు ద‌క్కించుకున్నారు. ఏపి ఆర్దిక మంత్రి య‌న‌మ‌ల‌.. తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ ఇద్ద‌రూ పుట్టా సుధాక‌ర్ కు వియ్యంకులు. రెండు ప్ర‌భుత్వాల నుండి కాంట్రాక్ట్ లు ద‌క్కించుకున్నార‌ని వైసిపి నేత‌లు చెబుతున్నారు. ఏపిలోని పోల‌వ‌రం లో పుట్టా సుధాక‌ర్ కాంట్రాక్ట‌ర్ గా ఉన్నార‌ని జ‌గ‌న్ త‌ర‌చూ ఆరోపిస్తూ ఉంటారు. ఇక‌, ఇప్పుడు క‌డ‌ప జిల్లాలోని ప్రొద్దుటూరు లోని పుట్టా సుధాక‌ర్ నివాసం లో ఐటి దాడులు కొన‌సాగుతున్నాయి.

ఉగ్ర‌..నారాయ‌ణ‌..ఇప్పుడు పుట్టా..

ఉగ్ర‌..నారాయ‌ణ‌..ఇప్పుడు పుట్టా..

ఒక వైపు ఎన్నిక‌ల ప్ర‌చారంలో టిడిపి అధినేత చంద్ర‌బాబు త‌మ పై ఐటి దాడుల తో వేధిస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో టిడిపి నేత‌లే ల‌క్ష్యంగా ఐటి దాడులు కొన‌సాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం టిడిపి నుండి క‌నిగిరి అసెంబ్లీ అభ్య‌ర్దిగా బ‌రిలో ఉన్న ఉగ్ర న‌ర‌సింహారెడ్డి కి చెందిన ఆస్ప‌త్రి పై రెండు రోజుల పాటు ఐటి దాడులు జ‌రిగా యి. చంద్ర‌బాబు క్యాబినెట్ లో కీల‌క మంత్రిగా ప‌ని చేసిన నారాయ‌ణ సంస్థ‌ల పైనా ఐటి దాడులు జ‌రిగాయి. నారాయ ణ నివాసం తో పాటుగా ఆయ‌న‌కు చెందిన మెడిక‌ల్ క‌ళాశాల పైనా దాడులు కొన‌సాగాయి. అయితే కీల‌క డాక్య‌మెంట్లు ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నార‌నే ప్ర‌చారం జ‌రిగినా..నారాయ‌ణ సంస్థ‌ల ప్ర‌తినిధులు మాత్రం సోదాల్లో ఎ టువంటి న‌గ‌దు..డాక్య‌మెంట్లు దొర‌క‌లేద‌ని..వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చామ‌ని చెబుతున్నారు. ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందుగా టిడిపి నేత‌గా ఉన్న ప్ర‌స్తుత నెల్లూరు ఎంపి అభ్య‌ర్ది బీదా మ‌స్తాన రావు సంస్థ‌ల మీద ఐటి దాడు లు జ‌రిగాయి. ఇప్పుడు పుట్టా సుధాక‌ర్ నివాసం లో సోదాలు కొన‌సాగుతున్నాయి.

టిడిపి లో క‌ల‌వ‌రం..

టిడిపి లో క‌ల‌వ‌రం..

పుట్టా సుధాక‌ర్ పై ఐటి దాడుల స‌మాచారం తెలియ‌గానే టిడిపిలో క‌ల‌వ‌రం మొద‌లైంది. పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర ప‌డుతు న్న స‌మ‌యంలో ఐటి దాడులు చేయ‌టం టిడిపి నుండి పోటీలో ఉన్న అభ్య‌ర్దుల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. ఈ ఎన్నిక‌ల్లోనే మ‌రి కొంద‌రు టిడిపి నేత‌లే లక్ష్యంగా దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని టిడిపి నేత‌లు అంచనా వేస్తున్నా రు. కృష్ణా, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోని వ్యాపార రంగంలో ఉన్న టిడిపి అభ్య‌ర్దులే లక్ష్యంగా రానున్న మూడు నాలు గు రోజుల్లో ఐటి దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. దీంతో, ఒక వైపు ఎన్నిక‌ల టెన్ష‌న్..మ‌రో వైపు ఐటి దాడుల ప్ర‌చారం తో టిడిపి అభ్య‌ర్దులు టెన్ష‌న్ ప‌డుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+