రూ.5కోట్ల ఆఫర్ వద్దంది, పవన్ కల్యాణ్ ను తిట్టమని నేనే చెప్పా: ఆర్జీవి సంచలనం

Recommended Video

    శ్రీరెడ్డి-అభిరామ్ ఇష్యూలో రూ. 5 కోట్ల సెటిల్మెంట్ ప్రయత్నం, పవన్‌ను తిట్టడం వెనక అతడే....!

    హైదరాబాద్: బూతు పదం ఉపయోగించి పవన్ కల్యాణ్ ను తిట్టమని శ్రీరెడ్డికి సలహా ఇచ్చింది తానే అని బాంబు పేల్చారు రాంగోపాల్ వర్మ. అంతేకాదు నిర్మాత సురేశ్ బాబు కుమారుడు అభిరామ్ చేసిన పనికి రూ.5కోట్ల సెటిల్మెంట్ ఆఫర్ చేస్తే శ్రీరెడ్డి తిరస్కరించిందని మరో సంచలన విషయం చెప్పారు. దాంతో ఆమెపై మరింత గౌరవం పెరిగిపోయిందన్నారు.

    రూ.5కోట్ల ఆఫర్ వద్దంది..

    రూ.5కోట్ల ఆఫర్ వద్దంది..

    శ్రీరెడ్డి అర్థనగ్న ప్రదర్శన చేసిన తర్వాత ఆమె పోరాటాన్ని తాను మరింత సీరియస్ గా తీసుకోవడం మొదలుపెట్టానన్నారు ఆర్జీవి. రెండు రోజులు ప్రయత్నించి ఆమె నంబర్ సంపాదించినట్టు తెలిపారు. ఆ సందర్భంగా ఆమెకో డీల్ ఆఫర్ చేశానని చెప్పారు.

    రూ.5కోట్లు తీసుకుని.. సురేశ్ బాబు ఫ్యామిలీతో రాజీకి రావాలని శ్రీరెడ్డికి సెటిల్మెంట్ ఆఫర్ ఇచ్చానని ఆర్జీవి తెలిపారు. అయితే శ్రీరెడ్డి మాత్రం ఆ ఆఫర్ ను తిరస్కరించిందని.. అది తనకు బిగ్ షాక్ అని చెప్పారు.

    ఆ మాటతో శ్రీరెడ్డిపై మరింత గౌరవం..:

    ఆ మాటతో శ్రీరెడ్డిపై మరింత గౌరవం..:

    ఇప్పుడు మీ దగ్గర డబ్బు తీసుకుంటే.. రేప్పొద్దున నా ముఖాన్ని నేనే అద్దంలో చూసుకోలేనని చెప్పింది. ఈ పోరాటం ఎంతోమంది అమాయక ఆడపిల్లలకు ఉపయోగపడుతుందని, కాబట్టి దాన్ని తాకట్టు పెట్టే రీతిలో తాను వ్యవహరించదలుచుకోలేదని ఆమె పేర్కొన్నట్టు ఆర్జీవి వెల్లడించారు.

    శ్రీరెడ్డి సమాధానంతో ఆమెపై మరింత గౌరవం పెరిగిందన్నారు. అయితే తాను డబ్బులు ఆఫర్ చేసిన విషయం సురేశ్ బాబుకు తెలియదని, ఆయన చట్టపరంగానే ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

    తిట్టమని నేనే చెప్పాను:

    తిట్టమని నేనే చెప్పాను:

    ఇక పవన్ కల్యాణ్ ను ఆ బూతు పదం ఉపయోగించి తిట్టాలని సలహా ఇచ్చింది కూడా తానే అని వెల్లడించారు రాంగోపాల్ వర్మ. అందుకే దానిపై శ్రీరెడ్డి ఎవరికీ సరైన వివరణ ఇవ్వలేకపోతుందన్నారు. ఆమెను ప్రభావితం చేసిన వ్యక్తిగా దానికి తానే నైతిక బాధ్యత వహిస్తున్నానని అన్నారు. ఈ చర్య వల్ల ఎవరైనా బాధపడి ఉంటే.. పవన్ కల్యాణ్ తో సహా వారందరికీ క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. అయితే ఆ పదాన్ని ఉపయోగించమని చెప్పడంలో ఉద్దేశం.. అదొక తీవ్ర స్థాయి ఎక్స్-ప్రెషన్ అని అన్నారు

     తెలిసినవి చెప్పాలనే.

    తెలిసినవి చెప్పాలనే.

    శ్రీరెడ్డి ఉదంతంలో తనకు తెలిసిన విషయాలను పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ విషయాలను బయటపెడుతున్నట్టు రాంగోపాల్ వర్మ వెల్లడించారు. ఓ యూట్యూబ్ వీడియో ద్వారా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఇంతవరకు శ్రీరెడ్డిని ఎప్పుడూ కలవలేదని, ఎప్పుడో ఒకసారి ఆమె నన్ను కలిసిందని, అదంత గుర్తు కూడా లేదని ఆర్జీవి చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+