ఏపీలో ప్రేక్షకులను అవమానిస్తున్నారు- థియేటర్ల కంటే కిరాణా షాపుల కలెక్షన్లే ఎక్కువ : హీరో నాని సంచలనం..!!
ఏపీ ప్రభుత్వం పైన టాలీవుడ్ గుర్రుగా ఉంది. హీరో నాని కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వ తీరు పైన పరోక్షంగా విమర్శలు చేసారు. సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు..థియేటర్లలో సోదాల పైన వారంతా ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా టిక్కెట్ల ధరల పైన ఎగ్జిబిటర్లు కోర్టుకు వెళ్లారు. అక్కడ వచ్చిన తీర్పు పైన ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు అప్పీల్ కు వెళ్లింది. ఈ రోజు మరోసారి విచారణ జరిగిన ఆ కేసు ను పిటీషనర్ల అభ్యర్ధన మేరకు న్యాయస్థానం వాయిదా వేసింది. ఇదే సమయంలో ఏపీ అధికారులు వరుసగా సినిమా థియేటర్లలో సోదాలు చేస్తున్నారు.

ప్రభుత్వ తీరుపైన పరోక్ష విమర్శలు
కొన్ని ప్రాంతాల్లో థియేటర్లను సీజ్ చేసారు. దీంతో...తూర్పు గోదావరిలో స్వచ్చందంగానే థియేటర్లను మూసివేసారు. ఇక, ఈ వ్యవహారం పైన శుక్రవారం విజయవాడలో సమావేశమై ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం పైన నేచురల్ హీరో నాని స్పందించారు. తాజాగా నాని నటించిన 'శ్యామ్ సింగ రాయ్' విడుదలకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 24న రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాని ఏపీ టికెట్ రేట్ల విషయంపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

ప్రేక్షకులను అవమానిస్తున్నారంటూ
"ఏపీలో టిక్కెట్ల విషయమై ఏం జరుగుతుందో అది కరెక్ట్ కాదని మనందరికీ తెలుసంటూ వ్యాఖ్యానించారు. మీరు ప్రేక్షకులను అవమానిస్తున్నారంటూ పరోక్షంగా ఏపీ ప్రభుత్వం పైన వ్యాఖ్యలు చేసారు. ఈ సినిమాలు..రాజకీయాలను పక్కన పెడితే ఇదంతా ప్రేక్షకులను అవమానించటమే అంటూ చెప్పుకొచ్చారు. టిక్కెట్ ధరలను వివరించారు. వీటి పైన మాట్లాడుతూనే...దీని పైన అనవసరంగా ఏ థంబ్ నెయిల్స్ పెడతారో అంటూ వ్యాఖ్యానించారు. రేపు అసలే సినిమా విడుదల అవుతోందని చెప్పారు.

థియేటర్ల మూసివేత.. సమస్యకు పరిష్కారం ఏంటి
10 మందికి ఉద్యోగాలు ఇచ్చి థియేటర్లు నడుపుతున్న ఒక వ్యక్తి కౌంటర్ కంటే పక్కనే ఉన్న కిరాణా షాప్ కౌంటర్ ఎక్కువగా ఉంటే కరెక్ట్ కాదు..అంటూ వ్యాఖ్యానించారు. చిన్నప్పుడు స్కూల్లో అందరం పిక్నిక్ కు వెళ్లేవాళ్లం... ఆ టైంలో అందరి దగ్గరా రూ.100 అడిగేవారు. అయితే అదే సమయంలో అందరూ రూ.100 ఇవ్వగలరు... నాని నువ్వు మాత్రం ఇవ్వలేవు... నువ్వు రూ. 0 ఇస్తే చాలు అంటే అది నన్ను ఇన్సల్ట్ చేసినట్టే...కదా అంటూ నాని చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు నాని అభిప్రాయం మొత్తం టాలీవుడ్ ప్రముఖుల అభిప్రాయంగా విశ్లేషణలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల ధరల విషయం..థియేటర్లలో సోదాల తీరు పైన అటు సినిమా..ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications