Panch Prasad: పంచ్ ప్రసాద్ శస్త్ర చికిత్స విజయవంతం.. జగన్‍కు ధన్యవాదాలు తెలిపిన కుటుంబం..
తెలుగు టెవిజన్ ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోతో ఎంతో మంది సినిమాల్లో రాణిస్తున్నారు. అయితే జబర్దస్త్ లో కమెడియన్ గా చేసే పంచ్ ప్రసాద్ కొద్ది సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రసాద్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ప్రసాద్ చికిత్స కోసం ఏపీ ప్రభుత్వం సాయం చేసింది. దీంతో పంచ్ ప్రసాద్ కు యశోద ఆస్పత్రిలో శస్త్ర చికిత్స నిర్వహించారు. శస్త్ర చికిత్స విజయవంతమైందని పంచ్ ప్రసాద్ భార్య సునీత చెప్పారు.
పంచ్ ప్రసాద్ కు విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రసాద్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. పంచ్ ప్రసాద్ కు రెండు కిడ్నీలు పాడవడంతో అతను డయాలసిస్ చేయించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతని ఆర్యోగంపై వైద్యులను సంప్రదించగా.. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే దీనికి భారీగా ఖర్చు అవుతుందని వారు చెప్పారు. తమ వద్ద అంత డబ్బు లేకపోవడంతో పంచ్ ప్రసాద్ డయాలసిస్ చేయించుకుంటున్నారు.

పంచ్ ప్రసాద్ ఆరోగ్యంపై జబర్దస్త్ నూకరాజు ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కొంత మంది దాతలు స్పందించారు. జ్యోతిష్యులు వేణు స్వామి స్పందించి రూ.లక్ష సాయం చేశారు. పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని మంత్రి రోజా ఏపీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన జగన్ సీఎం రిలీఫ్ ఫంఢ్ ద్వార పంచ్ ప్రసాద్ సాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో పంచ్ ప్రసాద్ కు శస్త్రి చికిత్స చేసి మూత్రపిండాల మార్పిడి చేశారు. తమకు సాయం చేసిన ఏపీ సీఎం జగన్ సునీత్ ధన్యవాదాలు తెలిపారు.

ఏపీ ప్రభుత్వ సాయంతో తన భర్తకు విజయవంతంగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటెషన్ చేశారని చెప్పారు. ప్రస్తుతం తన భర్త ఆరోగ్యం బాగుందని పేర్కొన్నారు. సీఎం జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొంది. పంచ్ ప్రసాద్ త్వరలోనే కోలుకుని ప్రేక్షకుల ముందుకు వస్తారని తెలిపారు. పంచ్ ప్రసాద్ ఆపరేషన్ విజయవంతం అవడంతో జబర్దస్త్ కమెడియన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications