Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జనసేన అభ్యర్ధిగా హైపర్ ఆది : నియోజకవర్గం ఫిక్స్ - పవన్ హామీ..!?

ఏపీ లో ఎన్నికల మూడ్ వచ్చేసింది. ఎన్నికలకు పార్టీలు సిద్దం అవుతున్నాయి. టీడీపీ - జనసేన పొత్తు లాంఛనమే. దీంతో, జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది...ఎవరెవరు ఆ పార్టీ నుంచి బరిలో ఉంటారనే అంచనాలు పెరిగిపోతున్నాయి. పవన్ కల్యాణ్ ఎవరికి ఈ సారి ప్రాధాన్యత ఇస్తారనేది ఆసక్తిగా మారుతోంది. అందులో ఇప్పుడు పొలిటికల్ - సినీ రంగాల నుంచి పలువురి పేర్లు ప్రముఖుంగా వినిపిస్తున్నాయి. జబర్దస్త్ తో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు పవన్ కు బలమైన మద్దతుదారుడిగా మారిన హైపర్ ఆది పోటీ పైన ప్రచారం మొదలైంది. హైపర్ ఆది జనసేన నుంచి పోటీ చేస్తారని..ఆ సీటు ఖాయమైందంటూ అంచనాలు మొదలయ్యాయి. మరి..ఆది అసెంబ్లీ సీటు ఆశిస్తున్నారా.. పవన్ అందుకు అంగీకారం తెలిపారా..

పవన్ అభిమానిగా.. జనసేనానికి దగ్గరగా

పవన్ అభిమానిగా.. జనసేనానికి దగ్గరగా

హైపర్ ఆది తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రచారం పొందారు జబర్దస్త్ లో కామెడీ పంచ్ లతో తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు. అదే సమయంలో పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్ పైన తన అభిమానం చాటుకున్నారు. జనసేన కార్యక్రమాలకు హాజరయ్యారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా రణస్థంలో జనసేన నిర్వహించిన యువశక్తి సభలోనూ ఆకట్టుకొనే ప్రసంగం చేసారు. పవన్ పైన తన విధేయత చాటుకున్నారు. ఆది ప్రసంగం గురించి పవన్ కల్యాణ్ తన స్పీచ్ లోనూ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇప్పుడు ఆది పవన్ నటిస్తున్న హరహర వీరమల్లు సినిమాలోనూ ఉన్నారు. అక్కడే పవన్ కు మరింత సన్నిహితంగా మారారని చెబుతున్నారు. దీంతో, పవన్ కూడా ఆదికి అటు సినిమా ..ఇటు పొలిటికల్ గానూ సపోర్ట్ చేయాలని నిర్ణయించినట్లు పార్టీ నేతల సమాచారం.

ఆది ఎన్నికల్లో పోటీ - పవన్ అంగీకరిస్తారా

ఆది ఎన్నికల్లో పోటీ - పవన్ అంగీకరిస్తారా

వచ్చే ఎన్నికల్లో హైపర్ ఆది అవకాశం వస్తే జనసేన నుంచి పోటీకి సిద్దంగా ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇందు కోసం ఆది సొంత జిల్లా ప్రకాశం నుంచి పోటీ చేస్తారంటూ న్యూస్ వైరల్ అవుతోంది. టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా జనసేనకు ప్రకాశం జిల్లా నుంచి రెండు సీట్లు ఖాయమని చెబుతున్నారు. అందులో గిద్దలూరు..దర్శ ఉన్నాయని సమాచారం. ఇప్పుడు హైపర్ ఆదికి దర్శి నుంచి పోటీకి ఛాన్స్ ఉందని తెలుస్తోంది. గత ఎన్నికల్లోనే ఆది జనసేన కోసం ప్రచారం చేసారు. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన ఆదికి దర్శి సీటు ఇస్తారంటూ జనసేన వర్గాల్లోనే ప్రచారం సాగుతోంది. ఆది కోసం పవన్ కు మెగా బ్రదర్ నాగబాబు కూడా రికమెండ్ చేసారని చెబుతున్నారు. పవన్ వద్ద ఇప్పటికే మార్కులు కొట్టేసిన ఆదికి సీటు విషయం పైన మాత్రం టీడీపీతో పొత్తు..సీట్ల పంపకాలు..అభ్యర్ధుల విషయంలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

పవన్ సిద్దమైనా - చంద్రబాబు అంగీకరిస్తారా

పవన్ సిద్దమైనా - చంద్రబాబు అంగీకరిస్తారా

2024 ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో కీలకం. అటు అధికార వైసీపీ..ఇటు టీడీపీ - జనసేన పార్టీలకు ప్రతిష్ఠాత్మకం. ప్రతీ సీటులో గెలుపు అనివార్యం. ఈ సమయంలో ఎవరికి సీటు కేటాయించినా ఆచి తూచి నిర్ణయం తీసుకొనే పరిస్థితి కనిపిస్తోంది. జనసేన కు కేటాయించిన సీట్లలో అభ్యర్ధుల ఎంపిక పూర్తిగా పవన్ కల్యాణ్ నిర్ణయాల పైన ఆధారపడి ఉంటుంది. అయితే, పొత్తు అధికారకంగా ప్రకటించిన తరువాత అభ్యర్దుల విషయంలో సర్వేలు.. క్షేత్ర స్థాయిలో వాస్తవాలను పరిగణలోకి తీసుకున్న తరువాతనే పార్టీ నుంచి పోటీ చేసే వారి పైన తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. జనసేనకు సీట్లు కేటాయించినా.. టీడీపీ పోటీ చేసే స్థానాలు ఖరారైనా అటు చంద్రబాబు - ఇటు పవన్ కల్యాణ్ ఇద్దరి ఆమోదంతోనే తుది జాబితా వెల్లడి కానుంది. దీంతో.. ఆర్టిస్ట్ గా సక్సెస్ అయిన ఆదికి పొలిటికల్ గానూ ఎంట్రీ ఇస్తారా.. నిజంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా..లేక పవన్ మద్దతు దారుడిగా ప్రచారానికే పరిమితం అవుతారా అనేది తేలాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+