విశాఖలో టెన్షన్ - గర్జనలో సీమ నేతలు : పవన్ రాక - టీడీపీ భేటీ..!!
సాగరతీరంలో పొలిటికల్ టెన్షన్ మొదలైంది. మరి కాసేపట్లో విశాఖలో పరిపాలనా రాజధాని డిమాండ్ తో గర్జన పేరుతో భారీ ర్యాలీకి సిద్దమైంది. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరగనుంది. దాదాపు లక్ష మంది వరకు ఈ ర్యాలీలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. పరిపాలనా వికేంద్రీకరణకు మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు ఈ గర్జనకు మద్దతుగా నగరానికి చేరుకున్నారు. ఉత్తరాంధ్రతో పాటుగా రాయలసీమ నేతలు ఈ గర్జనలో పాల్గొంటున్నారు.
నగరంలోని ఎల్ఐసీ జంక్షన్ లోని అంబేద్కర్ సర్కిల్ నుంచి బీచ్ రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వరకు దాదాపు నాలుగు కిలో మీటర్ల మేర ఈ గర్జన ర్యాలీ జరగనుంది. పరిపాలనా రాజధాని ద్వారానే ఉత్తరాంధ్ర అభివృద్ధి అనే నినాదంతో ఈ ర్యాలీకి సిద్దమయ్యారు. ఈ ర్యాలీకి వైసీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జాతీయ పతాకాలతో ర్యాలీలో పాల్గొనాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. ఈ ర్యాలీలో ఉత్తరాంధ్ర కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసారు. ర్యాలీ అనంతరం బీచ్ రోడ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేసారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్నాహ్నం విశాఖ రానున్నారు. పార్టీ నేతలత సమావేశం కానున్నారు. ఇప్పటికే జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు విశాఖ చేరుకున్నారు. మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనను వైసీపీ మంత్రులు తప్పు బడుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే పవన్ వస్తున్నారని విమర్శిస్తున్నారు. టీడీపీ కొత్త నినాదంత వైసీపీకి కౌంటర్ ఇచ్చేందుకు సిద్దమైంది.
సేవ్ విశాఖ పేరుతో మూడేళ్ల కాలంలో విశాఖలో జరిగిన పరిణామాలను వివరించేందుకు సిద్దమయ్యారు. ఉత్తరాంధ్రలో రాజకీయంగా పై చేయి సాధించేందుకు వైసీపీ ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు టీడీపీ ఈ నినాదం ఎంచుకుంది. కానీ, ఇది ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్ పరిపాలనా రాజధానిగా వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో..విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో పట్టు కోసం ప్రధాన రాజకీయ పార్టీల వ్యూహాలతో పొలిటికల్ టెన్షన్ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications