అక్ర‌మ‌ అరెస్ట్‌లు జ‌రుగుతాయి: ఎన్నిక‌లు మీరే చేయాలి: ప‌వ‌న్ కు బాబు డ‌బ్బులు : జ‌గ‌న్ ..!

పులివెందుల వేదిక‌గా వైసిపి అధినేత జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. నామినేష‌న్ వేసేందుకు వ‌చ్చిన జ‌గ‌న్ పులి వెందుల లో బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. క‌డ‌ప జిల్లాలో కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని వివ‌రించారు. క‌డ‌ప లో వివే కా హ‌త్య త‌రువాత జ‌రుగుతున్న ప‌రిణామాల పై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. క‌డ‌ప జిల్లాలో వైసిపి అభ్య‌ర్దుల గెలుపు బాధ్య‌త ప్ర‌జ‌ల‌దే అంటూ పిలుపునిచ్చారు.

అక్ర‌మ అరెస్ట్‌లు జ‌రుగుతాయి

అక్ర‌మ అరెస్ట్‌లు జ‌రుగుతాయి

వివేకా హ‌త్య చేయించింది టిడిపి నేత‌లు..విచార‌ణ చేయిస్తుంది వారు..వేధిస్తుంది మ‌న‌ల‌ను అంటూ జ‌గ‌న్ వ్యాఖ్యా నించారు.చిన్నాన్న‌ను చంపితే జ‌మ్మ‌ల మ‌డుగులో తిరితేవారు లేరు. పులివెందుల లోనూ ఎన్నిక‌లు చేసే వారు లేరు. హ‌త్య ను కుట్ర పూరితంగా మా కుటుంబ స‌భ్యుల పై మోపి అక్ర‌మంగా అరెస్ట్ లు చేసే అవ‌కాశం ఉంది. ఆ స‌మ‌యం లో ఎన్నిక‌లు చేసే వారు లేకుండా చేయ‌ట‌మే వారి ల‌క్ష్యం అని పేర్కొన్నారు. తాను రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల ప్ర‌చా రం చేయాల్సి ఉండ‌టంతో..జిల్లాలో ఎన్నిక‌ల ప్రచారానికి రాలేక పోవ‌చ్చ‌ని చెప్పుకొచ్చారు. ఇక్క‌డ ఎన్నిక‌లు మీరే చేయాలి..మేరే గెలిపించాని పిలుపునిచ్చారు. ఎన్నిక‌ల ముందు గంద‌ర‌గోళ ప‌రిస్థితితులు తేవ‌టానికి ప్ర‌యాత్నాలు జ‌రుగుతాయి..అన్ని స‌మ‌యాల్లోనూ సంయ‌మ‌నం తో ఉండండి..ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా ప‌ని చేయండి. ఎన్నిక ల్లో గెలిచేది మ‌న పార్టీయే అంటూ వివ‌రించారు.

సినీ యాక్ట‌ర్‌..జేడి ఇలా..

సినీ యాక్ట‌ర్‌..జేడి ఇలా..

ఇక‌, చంద్ర‌బాబు పార్ట‌న‌ర్ అయిన ఓ సినిమా యాక్ట‌ర్ ఎన్నిక‌ల్లో స‌హ‌క‌రిస్తున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు. ఆ యాక్ట‌ర్ ఎక్క‌డ పోటీ చేయాలి..సిబిఐ మాజీ జెడిని ఎక్క‌డి నుండి బ‌రిలోకి దింపాలి ఇలా మొత్తం వ్య‌వ‌హారాలు చంద్ర‌బాబు సూచ‌న‌ల మేర‌కే న‌డుచుకుంటున్నార‌న్నారు. అభ్య‌ర్దులు ప్ర‌క‌ట‌న‌..ఎవ‌రు ఎక్క‌డ పోటీ చేయాలి..ఎవ‌రికి ఎంత ఖర్చు చేయాలి ఇలా..అన్ని అంశాలు మొత్తం చంద్ర‌బాబు చూస్తున్నార‌ని..ఎన్నిక‌లు అవ‌స‌ర‌మయ్యే డ‌బ్బుల‌ను అందిస్తు న్నార‌ని ఆరోపించారు. జెడిని భీమిలి కాద‌ని...విశాఖ ఎంపీగా నిల‌బెట్టింది చంద్ర‌బాబే అన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాన్ నామినే ష‌న్ వేస్తే అక్క‌డ టిడిపి జెండాలు ఉంటాయ‌ని ఎద్దేవా చేసారు.

ఎన్నికల ప్రచారంలో జగన్: హోరెత్తిన జనం (ఫొటోలు)

పులివెందుల అభివృద్ది వైయ‌స్ దే..

ఇక‌, పులివెందుల లో అభివృద్ది గురించి జ‌గ‌న్ వివ‌రించారు. అయిదేళ్ల కాలంలో పులివెందుల నిర్ల‌క్ష్యానికి గురైంద‌ని ఆరోపించారు. కొంత మంది జైలు శిక్ష అనుభ‌వించి విడుద‌ల అయిన వారు కుట్ర‌లు చేస్తున్నార‌న్నారు. పులివెందుల లో వైసిపికి వేసే ప్ర‌తీ ఓటు నా గెలుపు కోసం కాద‌ని..రాష్ట్రంలో మార్పు కోస‌మ‌ని చెప్పుకొచ్చారు. త‌న‌కు ప్ర‌తీ వేళ అం డ‌గా ఉన్న పులివెందుల ప్ర‌జ‌లు ఇప్పుడు జ‌రుగుతున్న కుట్ర సమయంలోనూ అండ‌గా ఉండాల‌ని కోరారు. చిన్నాన్న హ‌త్య పై అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని వివ‌రించారు. ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు డిపాజిట్లు సైతం రాని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+