వైసీపీ అభిమానులకు కిక్కు ఇచ్చే ఫొటో

వైఎస్ కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆస్తుల కోసం అన్న,చెల్లెల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఆస్తుల కోసం ఒకరిపై మరోకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తప్పు నీదంటే నీదంటూ ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటున్నారు. జగన్, షర్మిలకు ఇద్దరికి సమానంగా ఆస్తి పంపకాలు చేశారానేది సుస్పష్టం. అయితే ఇద్దరి మధ్య ఉమ్మడి ఆస్తుల విషయంలో విభేదాలు వచ్చాయి.

చెల్లెలుపై ప్రేమతో తన వాటాలో కూడా ఆస్తి ఇస్తానని జగన్ షర్మిలతో ఒప్పందం చేసుకున్నారు. అయితే షర్మిల రాజకీయ ప్రత్యర్థిగా మారడంతో ఆమెకు తన వాటా ఇచ్చేది లేదని జగన్ తేల్చి చెప్పారు. దీనిపై జగన్ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. పిటిషన్‌లో తల్లి విజయమ్మ పేరును కూడా జగన్ ప్రస్తావించారు. ప్రస్తుతం జగన్, షర్మిల ఆస్తుల వివాదం కోర్టుకెక్కింది. ఆస్తుల వివాదంపై తల్లి విజయమ్మ.. ఎట్టకేలకు బయటకొచ్చారు. ఆస్తులకు సంబంధించి వైఎస్ విజయమ్మ ఓ బహిరంగ లేఖ రాశారు. అందరు అనుకున్నట్టుగానే ఈ లేఖలో కూతురు షర్మిలకే విజయమ్మ అండగా నిలిచారు.

Jagan and Vijayamma as special attraction in Christmas celebrations

జగన్, షర్మిల ఇద్దరూ తనకు సమానమంటూనే కూతురుకు మద్దతుగా పలు అంశాలను ప్రస్తావించారు. విజయమ్మ షర్మిలకు మద్దతుగా నిలవడంతో వైసీపీ శ్రేణులకు ఇబ్బందిగా మారింది.ఇలాంటి తరుణంలో క్రిస్మస్ వేడుకల్లో జగన్, విజయమ్మ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇడుపులపాయ ప్రేయర్‌ హాల్‌లో జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో విజయమ్మ, జగన్‌ కలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన తల్లి విజయమ్మ చేయి పట్టుకొని కేక్ కట్ చేయించారు. కుమారుడిని దగ్గరకు తీసుకొని తల్లి విజయమ్మ ఆప్యాయంగా ముద్దు పెట్టారు. జగన్‌తో పాటు కుటుంబ సభ్యులు సైతం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+