జగన్‌కు అంత ధైర్యం ఏంటబ్బా..?

సామాన్యులు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఉందా అంటే లేదనే సమాధానం వస్తోంది. విలువులతో కూడిన రాజకీయం చూడాలంటే ఈ రోజుల్లో కాస్తా కష్టమే అని చెప్పాలి. డబ్బుతో కూడిన రాజకీయాలే నేటితరంలో ఎక్కువుగా కనిపిస్తోంది. గ్రామ సర్పంచ్‌గా పోటీ చేయాలంటనే లక్షలు ఖర్చు చేయాలి. మరీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఓ సామాన్యుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడమంటే అది కలే.

అలాంటి కలను సాకారం చేసి చూపిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. వచ్చే ఎన్నికల్లో సామాన్య కార్తకర్తకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సీఎం జగన్ పెద్ద సాహసమే చేస్తున్నారు. దాదాపు 14 మంది సామాన్య వ్యక్తులను తమ పార్టీ అభ్యర్థులుగా జగన్ ప్రకటించారు. ఇందులో ఎంపీపీలు, జెడ్పీలు, సర్పంచ్‌లు ఉన్నారు. వీరితో పాటు,శింగనమల నియోజకవర్గంలో ఓ సాధారణ డ్రైవర్‌ను అభ్యర్థిగా ప్రకటించి జగన్ సంచలనం సృష్టించారు.వచ్చే ఎన్నికల్లో శింగనమల అభ్యర్థిగా టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న వీరాంజనేయులును అధికార పార్టీ బరిలో దించింది.

jagan announced tipper driver as a contestant from singanamala constituency

నియోజకవర్గంలో జోన్నలగడ్డ పద్మవతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమెను కాదని వీరాంజనేయులుకు టికెట్ ఇవ్వడంపై పార్టీ నాయకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నియోజకవర్గంలో చాలామంది పేరున్న నాయకులు ఉన్నప్పటికి వారిని దాటుకుని వీరాంజనేయులుకు ఎలా టికెట్ దక్కిందో ఎవరికి అర్థం కావడం లేదు. టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తూ తన కుటుంబాన్ని చూసుకుంటున్నారు వీరాంజనేయులు. స్థానికంగా వీరాంజనేయులుకు మంచి గుర్తింపు ఉంది.

వీరాంజనేయులు 2014 ఎంఎడ్‌ను పూర్తి చేశారు. అనంతరం ప్రజలకు సేవ చేయాలనే కోరికతో రాజకీయాల్లోకి వచ్చారు. తన తండ్రి కూడా గతంలో సర్పంచ్‌గా పని చేశారు. ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వీరాంజనేయులకు ఎటువంటి ఆస్తులు లేవు. వైఎస్సార్‌‌సీపీకి వీర విధేయుడిగా, పార్టీనే నమ్మకుని పని చేస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో పార్టీ కార్యక్రమాలను వీరాంజనేయులు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు.

jagan announced tipper driver as a contestant from singanamala constituency

దీని కారణంగానే వీరాంజనేయులును జగన్ తమ అభ్యర్థిగా ప్రకటించారని పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే ఎన్నికల్లో వీరాంజనేయులు ఘన విజయం సాధిస్తే.. ఓ డ్రైవర్ ప్రజా ప్రతినిధిగా చట్టసభల్లో అడుగు పెట్టి రికార్డు సృష్టించనున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ పేద కుటుంబానికి చెందిన నందిగామ సురేష్‌ను వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించి గెలిపించారు. అతి సామాన్యులకు సైతం టికెట్లు కేటాయిస్తూ సీఎం జగన్ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తూ... అసలైన రాజకీయానికి అర్థం చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.మరి జగన్ తమపై ఉంచిన నమ్మకాన్ని ఈ సామ్యానులు ఎలా నిలబెట్టుకుంటారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+