ఎన్నికల ముందు గుడ్ న్యూస్..ఫుల్ జోష్‌లో వైసీపీ

ఏపీ సీఎం , వైసీపీ అధినేత జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేసింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సీఎం జగన్ సిద్ధం పేరిట ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చూట్టారు. సిద్ధం సభలకు పార్టీ కార్యకర్తల నుంచే కాకుండా సామాన్య ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన లభించింది. దీంతో మేమంతా సిద్ధం పేరిట సీఎం జగన్ బస్సు యాత్ర చేపట్టారు.

దీనిలో భాగంగా అన్ని జిల్లాలను కవర్ చేస్తూ ఈ బస్సు యాత్ర సాగుతోంది. జగన్ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చేసిన పాదయాత్రకు మించిన ప్రజాధారణ బస్సు యాత్రకు లభిస్తోందని వైసీపీ నేతలు చేబుతున్నారు. జగన్ ప్రజలతో మమేకం అవుతున్న తీరుకు ప్రతిపక్షాలు సైతం షాక్ అవుతున్నాయి. జగన్ బస్సు యాత్ర చేపట్టిన తరువాత వైసీపీ క్యాడర్ మొత్తం కూడా యాక్టివ్ అయినట్టుగా కనిపిస్తోంది

jagan bus yatra huge success in front of elections

ఇదిలా ఉంటే జగన్ బస్సు యాత్ర చేపట్టిన తర్వాత వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా వైసీపీలో చేరినట్టు లెక్కలు చెబుతున్నాయి. జగన్ బస్సు యాత్ర మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు 221 మంది వివిధ పార్టీలకు చెందిన నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నేతలు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉండటం విశేషం.

ఇక గత ఎన్నికల్లో జనసేన తరుఫున ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన నేతలు సైతం భారీగా వైసీపీలో చేరడం జరిగింది. టీడీపీ, జనసేన బలంగా ఉన్న స్థానాల నుంచే ఈ చేరికలు ఉండటం విశేషం. రాయలసీమ, విజయవాడ, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇదే సమయంలో లక్ష ఇరవై ఐదువేల మంది వివిధ పార్టీలకు చెందిన క్రియాశీల కార్యకర్తలు అధికారికంగా వైసీపీలో చేరినట్టు తెలుస్తోంది.

పార్టీ అధినేత జగన్ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన తర్వాత వ్యతిరేకత అనే పదానికి తావు లేకుండా పోయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ ఇంతటి స్థాయిలో చేరికలు జరగలేదని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు పలు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఇలా వైసీపీలో చేరడంతో ఆ పార్టీ నేతలు ఫుల్ జోష్‌లో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+