• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చిచ్చుపెట్టిన జగన్ నిర్ణయం ... యడ్డీ కూడా జగన్ బాటలో స్థానికులకే ఉద్యోగాలని సంచలనం

|

స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశంలో చిచ్చు పెట్టబోతుందా ? కర్ణాటక రాష్ట్రంలో ఉద్యోగాలు కన్నడిగులకే అని కర్ణాటక సీఎం యడ్యూరప్ప కూడా జగన్ బాటలో పయనించనున్నారా ? ఇక ఇదే పంథా అన్ని రాష్ట్రాలు అవలంబిస్తే.. తమ రాష్ట్రాల్లోని యువత కోసమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటిస్తే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల యువత ఇతర రాష్ట్రాలలో ఉద్యోగాలు పెద్దఎత్తున చేస్తున్న నేపథ్యంలో జగన్ తీసుకొన్ననిర్ణయం ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల మీద పడబోతోందా? అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన అంశం.

ఏపీ యువతకు తలనొప్పిగా మారిన జగన్ నిర్ణయం ..చట్టం చేసినప్పుడే వ్యతిరేకించిన ప్రతిపక్షాలు

ఏపీ యువతకు తలనొప్పిగా మారిన జగన్ నిర్ణయం ..చట్టం చేసినప్పుడే వ్యతిరేకించిన ప్రతిపక్షాలు

ఏపీలో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీ ప్రజలకే తలనొప్పి తెచ్చిపెట్టే లా ఉంది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్ తీసుకున్నటువంటి విప్లవాత్మక నిర్ణయం ఒక్క ఏపీ లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పెద్ద చిచ్చు పెట్టేలా ఉందని తెలుస్తుంది. ఎప్పుడైతే ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభ బడ్జెట్ సమావేశాలలో స్థానికులకు 75% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చట్టం చేశారో అప్పుడే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇక ఇదే నిర్ణయం ఇతర రాష్ట్రాల వాళ్లు తీసుకుంటే బెంగుళూరు, చెన్నై, పూణే, కలకత్తా వంటి మహానగరాల్లో మనవాళ్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న ప్రశ్న అప్పుడే ఉత్పన్నమైంది. ప్రతిపక్ష పార్టీలు జగన్ తీసుకున్న నిర్ణయ ప్రభావం భవిష్యత్తులో ఉంటుందని తేల్చి చెప్పాయి. ఇక కేంద్ర సర్కార్ కూడా జగన్ తీసుకొన్ననిర్ణయం పైన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఫెడరల్ స్పూర్తికి ఇది విరుద్ధం అని తేల్చి చెప్పాయి పలు రాజకీయ పార్టీలు.

జగన్ బాటలో కర్ణాటక సీఎం యడియూరప్ప నిర్ణయం .. స్థానికులకే ఉద్యోగాలని ట్వీట్

జగన్ బాటలో కర్ణాటక సీఎం యడియూరప్ప నిర్ణయం .. స్థానికులకే ఉద్యోగాలని ట్వీట్

ఏపీలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారని, అందుకోసం నిరుద్యోగం తగ్గించాలని భావించిన జగన్ ప్రభుత్వం స్థానికులకు 75% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఇక్కడి ఉద్యోగాలకు స్థానికులు అర్హులని, రాష్ట్ర ప్రజలే రాష్ట్రంలో ఉద్యోగాలను చెయ్యాలని, ఇతర రాష్ట్రాల వారికి అవకాశం ఇవ్వకూడదని జగన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇప్పుడు పెను చిచ్చు రేపుతోంది. ఇక జగన్ తీసుకున్న తరహా నిర్ణయమే కర్ణాటక కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా తీసుకున్నారు. దీనితో అక్కడ కర్ణాటక ఉద్యోగాలు కన్నడిగులకే చెందాలని ఆయన ట్వీట్ చేశారు. దీనికి అనుగుణంగా తాము చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలోని ప్రజాభిప్రాయం కూడా ఇదేనని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని ఎల్లప్పుడూ మేం పరిగణనలోకి తీసుకుంటామని చెప్పిన యడియూరప్ప ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ముందుకు పోతామని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన యడియూరప్ప.. కర్ణాటకలోని ఉద్యోగాలు కన్నడిగులకే అనే హ్యాష్ ట్యాగ్ ను తన ట్వీట్ కు జతచేశారు.

కర్ణాటకలో ఉద్యోగాలు చేస్తున్న తెలుగువారికి తిప్పలు .. జగన్ నిర్ణయ పర్యవసానం

కర్ణాటకలో ఉద్యోగాలు చేస్తున్న తెలుగువారికి తిప్పలు .. జగన్ నిర్ణయ పర్యవసానం

ఇక స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని కర్ణాటక రాష్ట్రంలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున నిరసనకు దిగే ఆలోచనలో ఉన్నారు. ఇక వీరికి మద్దతుగా ప్రముఖ సినీ నటుడు ఉపేంద్ర ఈ ఆగష్టు నెల 14,15 తారీఖుల్లో జరగబోయే ఉద్యమంలో పాలుపంచుకోనున్నారు .ఇప్పటికే ఈ ఉద్యమానికి కూడా కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఒకవేళ ఇదే కానీ జరిగితే తమ పరిస్థితి ఏంటి అని బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్న తెలుగు వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం తమ కొంప ముంచేలా ఉందని వారు లబోదిబోమంటున్నారని సమాచారం. ఏది ఏమైనా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని జగన్ తీసుకున్న నిర్ణయం ప్రాంతీయ తత్వానికి పునాదులు వేసేలా ఉందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

English summary
Karnataka CM Yeddyurappa has taken a similar decision like AP CM Jagan . He tweeted that Karnataka jobs should be done for Kannada people only . Yeddyurappa said that we will always take public opinion at the field level. so, we decided to give jobs only for karnataka locals said Yeddyurappa, he responded on Twitter to this extent, added a hashtag called Kannadigulake Karnataka udhyogalu .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X