చంద్రబాబు ఆనాడే పుట్టి ఉంటే..! హోదాపై బాబును ఏకేసిన జగన్
నెల్లూరు : ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్. నెల్లూరులో ఏర్పాటు చేసిన యువభేరీ సమావేశంలో ప్రసంగించిన ఆయన.. ప్రత్యేక హోదా విషయంలోను, ఏపీ ప్రజలకు ఇచ్చిన పలు హామిల విషయంలోను చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తూ ప్రభుత్వ పనితీరును కడిగిపారేశారు.
ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడిన విద్యార్థి నాయకులను అభినందించిన జగన్.. ఉద్యోగాల పేరుతో చంద్రబాబు ఏపీ నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. జాబు వస్తే బాబు వస్తుందని ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన చంద్రబాబు సీఎం అయ్యాక అన్నీ హామిలను గాలికొదిలేశారని విమర్శించారు.

ఏపీ విద్యార్థులంతా అడిగేదొకటే అని చెప్పుకొచ్చిన జగన్.. రాష్ట్ర విభజన నేపథ్యంలో నిరుద్యోగులంతా హైదరాబాద్ వెళ్లే పరిస్థితి లేదని, చదువయ్యాక ఉద్యోగం కావాలన్న నినాదం ప్రతీ స్వరం చేస్తోందని తెలిపారు.
ఇక హోదా పట్ల తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తున్నారని చంద్రబాబుపై విరుచుకుపడ్డ జగన్.. స్వాతంత్ర్యం కోసం పోరాటం జరుగుతున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు పుట్టి ఉండకపోవడం భారతదేశం చేసుకున్న అదృష్టం అన్నారు. అలాగే ప్రస్తుతం ఏపీకి సీఎంగా కొనసాగుతుండడం ఏపీ ప్రజల దురదృష్టం అని ఎద్దేవా చేశారు.
ఇప్పుడు ప్రత్యేక హోదా పైనే పలుమార్లు మాట మారుస్తున్న చంద్రబాబు.. స్వాతంత్ర్యం సమయంలో గనుక జన్మించి ఉంటే స్వాతంత్ర్యం ఒక్కటే సరిపోతుందా..? స్వాతంత్ర్యం వస్తేనే అన్ని వస్తాయా..? అని లేని కొర్రీలు పెట్టేవారని వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications