27న జ‌గ‌న్ గృహ ప్ర‌వేశం : వారంద‌రికీ ఆహ్వానాలు: అదే రోజు భారీగా వైసిపి లోచేరిక‌లు..!

వైసిపి అధినేత జ‌గ‌న్ ఇక అమ‌రావ‌తి కేంద్రంగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగనున్నారు. అమ‌రావ‌తి స‌మీపంలోని తాడేప‌ల్లి వ‌ద్ద జ‌గ‌న్ కొత్త ఇంటిని ...పార్టీ కార్యాల‌యాన్ని నిర్మించుకున్నారు. ఈ నెల 27న ఆ ఇంటి గృహ‌ప్ర‌వేశం జ‌ర‌గ‌నుంది. ఆ కార్య‌క్ర‌మానికి ప‌లువురుకి ఆహ్వానాలు పంపారు. అదే రోజు పార్టీలో చేరిక‌లు ప్రారంభం కానున్నాయి.

27న గృహ‌ప్ర‌వేశానికి ఆహ్వానాలు..
వైసిపి అదినేత జ‌గ‌న్ తాడేప‌ల్లి లో నిర్మించిన నివాసం..పార్టీ కార్యాల‌యం కు ఈ నెల 27న గృమ ప్ర‌వేశం జ‌ర‌గ‌నుంది. వాస్తవానికి ఫిబ్రవరి 14న ఉదయం 8.21 నిమిషాలకు చేయాలని ముహూర్తం ఖరారు చేశారు. కానీ, కుటుంబపరమైన కార ణాలతో గృహ ప్రవేశాన్ని వాయిదా వేస్తున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత జగన్ లండన్ వెళ్లడంతో దీనికి తా త్కాలికంగా బ్రేక్ పడింది.

Jagan house warming on 27th : Leaders joining on same day..

ఈ కార్య‌క్ర‌మానికి పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షు లు, ఎంపీలు, ఎ మ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియో జ కవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నాయకులంద రూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానించారు. ఇక‌, అక్క‌డి నుండే జ‌గ‌న్ ఎన్నిక‌ల శంఖారావం పూరించ‌నున్నారు.

ఆ రోజే పార్టీలోకి చేరిక‌లు..
ఈ నెల 27న గృహ ప్ర‌వేశం పూర్త‌యిన త‌రువాత జ‌గ‌న్ పార్టీ నేత‌ల‌తో కొత్త కార్యాల‌యం లో స‌మావేశం ఏర్పాటు చేసారు. ఆ స‌మావేశానికి పార్టీ నేత‌ల‌కు ఆహ్వానాలు అందాయి. అదే విధంగా..కొత్త‌గా పార్టీలో చేరే వారు ఆరోజున భారీగా త‌మ అనుచ‌రుత‌ల‌తో క‌లిసి పార్టీ నూత‌న కార్యాల‌యానికి రానున్నారు. ఇప్ప‌టికే టిడిపికి రాజీనామా చేసిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహ‌న్ 27న అధికారికంగా వైసిపి లో చేర‌నున్నారు.

Jagan house warming on 27th : Leaders joining on same day..

అదే విధంగా ద‌గ్గుబాటి కుటుంబ స‌భ్యులు, విజ‌య‌వాడ నుండి వైసిపి అభ్య‌ర్దిగా బ‌రిలోకి దిగ‌నున్న దాస‌రి జై ర‌మేష్ ఆ రోజే అధికారికంగా వైసిపి లో చేరేందుకు ముహూర్తంగా నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇక‌, మ‌రో వారం లో ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో ఈ నెల 28, మార్చి1న పెద్ద సంఖ్య‌లో టిడిపి నుండి వ‌ల‌స‌లు ఉంటాయ‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. ప్ర‌కాశం. తూర్పు గోదావ‌రి జిల్లాకు చెంద‌ని అధికార పార్టీ నేత‌లు వైసిపి లో వ‌స్తార‌ని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+