అక్కినేని మృతి: జగన్, భార్యతో లోకేష్ నివాళి (పిక్చర్స్)
హైదరాబాద్: అక్కినేని నాగేశ్వర రావు చివరి చూపు కోసం రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు బారులు తీరుతూనే ఉన్నారు. అక్కినేని భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులు అర్పిస్తున్నారు. అభిమానుల కోసం ఆయన భౌతిక కాయాన్ని గురువారం ఉదయం ఫిలిం ఛేంబర్‌లో ఉంచారు. అక్కడి నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభమైంది.
అక్కినేని నాగేశ్వర రావు అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతాయి. ఆయన మృతికి ఆంధ్రప్రదేశ్ కన్నీరు పెడుతోంది. కర్ణాటక శాసనసభ ఆయన మృతికి సంతాపం ప్రకటించింది.
వివాదరహితుడు కావడం, రాజకీయాలకు దూరంగా ఉండడంతో అన్ని పార్టీల నాయకులు, అన్ని రంగాల ప్రముఖులు ఆయనను కడసారి చూసేందుకు తరలి వచ్చారు. అక్కినేని నాగేశ్వర రావు మృతితో తెలుగు సినీరంగం పెద్ద దిక్కును కోల్పోయింది.

భార్య బ్రాహ్మణితో కలిసి వచ్చి లోకేష్..
బాలకృష్ణ కూతురు, భార్య అయిన బ్రాహ్మణితో కలిసి వచ్చి నారా లోకేష్ అక్కినేని నాగేశ్వర రావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

భాలకృష్ణ భార్య వసుంధరా దేవి..
అక్కినేని నాగేశ్వర రావు భౌతిక కాయానికి నందమూరి హీరో బాలకృష్ణ సతీమణి వసుంధరా దేవి నివాళులు అర్పించారు.

నాగార్జునతో చిరు, లోకేష్..
అక్కినేని నాగార్జునను పలకరిస్తూ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఓవైపు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ మరోవైపు..

మంత్రి కన్నా లక్ష్మినారాయణ..
అక్కినేని నాగేశ్వర రావు భౌతిక కాయానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ నివాళులు అర్పించారు.

సుహాసిని నివాళి..
ప్రముఖ సినీ నటి సుహాసిని అక్కినేని నాగేశ్వర రావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

నివాళులు అర్పించిన నాని
అక్కినేని నాగేశ్వర రావు భౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి హీరో నాని వచ్చారు. తెలుగు సినీ రంగం యావత్తు కదిలి వచ్చింది.

సరిత నివాళి...
అక్కినేని నాగేశ్వర రావు భౌతిక కాయానికి సినీ నటి సరిత నివాళులు అర్పించారు.

గల్లా జయదేవ్ నివాళి..
అక్కినేని నాగేశ్వర రావు భౌతిక కాయాన్ని సందర్శించి గల్లా జయదేవ్ తదితరులు నివాళులు అర్పించారు.

హరికృష్ణ నివాళి..
నందమూరి నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ అక్కినేని నాగేశ్వర రావు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

దర్శకుడు సుకుమార్..
తెలుగు సినిమా దర్శకుడు సుకుమార్ అక్కినేని నాగేశ్వర రావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications