జగన్ కేబినెట్ లో రోజా- అంబటికి దక్కిన ఛాన్స్ : అధికారిక జాబితా విడుదల - జిల్లాల వారీగా..!!
ఏపీ కొత్త కేబినెట్ అధికారికంగా ఖరారైంది. ప్రభుత్వం నుంచి గవర్నర్ కు జాబితా అందింది. సుదీర్ఘ కసరత్తు తరువాత సీఎం జగన్ ఎన్నికలే లక్ష్యంగా తన టీంను ఖరారు చేసారు. గతంలో 25 మందితో ఉన్న కేబినెట్ లో అందరితోనూ రాజీనామాలు తీసుకున్నారు. తాజా కేబినెట్ లో 25 మందితో సిద్దం చేసారు. అందులో పాత కేబినెట్ నుంచి 11 మందిని కొనసాగిస్తున్నారు. అదే విధంగా కొత్తగా 14 మందితో కేబినెట్ కూర్పు పూర్తి చేసారు. రేపు ఉదయం 11.31 గంటలకు వీరు ఏపీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గంలో స్థానం ఖరారు చేసిన వారికి సీఎంఓ నుంచి ఫోన్లు చేస్తున్నారు.

పది మంది పాత మంత్రుల కంటిన్యూ
ఇక, తాజా సమీకరణాల్లో పాత కేబినెట్ లో మంత్రులుగా పని చేసిన బొత్సా సత్యనారాయణ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. సిదిరి అప్పలరాజు.. చెల్లుబోయిన వేణు గోపాల క్రిష్ణ.. గుమ్మనూరు జయరాం..నారాయణ స్వామి..కొడాలి నాని..ఆదిమూలపు సురేష్..విశ్వరూప్ ...అంజాద్ బాషా తో పాటుగా తానేటి వనితను కొనసాగించాలని సీఎం నిర్ణయించారు. కొత్తగా 15 మందికి అవకాశం కల్పించారు. ఈ సారి కేబినెట్ లో శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాద రావు ను ఎంపిక చేసారు. ఇదే జిల్లా నుంచి అప్పలరాజు కొనసాగనున్నారు. విజయనగరం నుంచి బొత్సాను కొనసాగిస్తూనే... ఎస్టీ కోటాలో రాజన్న దొరక కు అవకాశం ఇచ్చారు. విశాఖ నుంచి ఇప్పటి వరకు అవంతి శ్రీనివాసరావు మంత్రిగా కొనసాగగా..కొత్త కేబినెట్ లో గుడివాడ అమర్ నాధ్ తో పాటుగా బూడి ముత్యాల నాయుడును ఖరారు చేసారు.

అంబటికి ఎట్టకేలకు అవకాశం
తూర్పు గోదావరి నుంచి చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణ..పినిపె విశ్వరూప్ ను కొనసాగిస్తూనే.. కొత్తగా దాడిశెట్టి రాజా.. కు ఛాన్స్ కల్పించారు. పశ్చిమ గోదావరి నుంచి తానేటి వనితను కొనసాగిస్తూనే..కొత్తగా కారుమూరి నాగేశ్వరరావు..కొట్టు సత్యనారాయణ కు అవకాశం ఇచ్చారు. క్రిష్ణా జిల్లా నుంచి కొడాలి నాని కంటిన్యూ అవుతున్నారు. ఆయనతో పాటుగా జిల్లా నుంచి జోగి రమేష్ కు చాన్స్ దక్కింది. గుంటూరు నుంచి అంబటి రాంబాబు తో పాటుగా విడదల రజని...మేరుగ నాగార్జున మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో..గుంటూరు జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది.

ఎస్సీ - బీసీలకు ప్రాధాన్యత
ప్రకాశం నుంచి ఆదిమూలపు సురేష్ ను కొనసాగించారు. నెల్లూరు నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డికి కేబినెట్ బెర్త్ ఖరారైంది. కర్నూలు నుంచి జయరాం..బుగ్గన కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతపురం జిల్లా నుంచి ఉష శ్రీ చరణ్ తో పాటుగా తిప్పేస్వామికి పదవి ఖారారైంది. కడప నుంచి అంజాద్ బాషా ను కొనసాగిస్తూనే... తీసుకున్నారు. చిత్తూరు జిల్లా నుంచి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి..నారాయణ స్వామిని కంటిన్యూ చేస్తూనే కొత్తగా రోజాకు అవకాశం కల్పించారు.












Click it and Unblock the Notifications