ప‌వ‌న్‌..అదేనా మ‌గ‌త‌నం అంటే.. అత‌డు నిత్య పెళ్లి కొడుకు: జ‌గ‌న్ టార్గెట్ ప‌వ‌న్‌..!

వైసిపి అధినేత జ‌గ‌న్‌..ఒక్క సారిగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ పై విరుచుకు ప‌డ్డారు. ప‌వ‌న్ ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసారు. కొద్ది రోజులుగా ప‌వన్ క‌ళ్యాన్ త‌న స‌భ‌ల్లో జ‌గ‌న్ ను ఉద్దేశించి చేస్తున్న విమ‌ర్శ‌లకు జ‌గ‌న్ తీవ్ర స్థాయిలో స్పందిం చారు. ప‌వ‌న్ పెళ్లిళ్ల విష‌యం మ‌రోసారి ప్ర‌స్తావించారు. జ‌గ‌న్ కు గ‌తంలో ప‌వ‌న్ మ‌గ‌త‌నం ఉందా అని వ్యాఖ్యానించ‌టం తో ఇప్పుడు తిరిగి జ‌గ‌న్ సైతం ప‌వ‌న్ ను ఆదే విధంగా ప్ర‌శ్నించారు. ఇక‌, ప‌వ‌న్ పెయిడ్ ఆర్టిస్ట్ అంటూనే చంద్రబాబు ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ ప‌ని చేస్తున్నార‌ని విమ‌ర్శించారు...

పాద‌యాత్ర లో భాగంగా వైసిపి అధినేత జ‌గ‌న్ శ్రీకాకుళం జిల్లా రాజాం లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ పై విరుచుకుప‌డ్డారు. ప‌వ‌న్ త‌న పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని..తాను అవినీతికి పాల్ప‌డ్డాన‌ని..జైలుకు వెళ్తాడ‌ని విమ‌ర్శిస్తున్నారంటూ..ప‌వ‌న్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అని విమర్శించారు. చంద్ర‌బాబు చేసే విమ‌ర్శ‌ల‌నే ప‌వ‌న్ చేస్తున్నార‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు - ప‌వ‌న్ మ‌ధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉంద‌న్నారు.

ప‌వ‌న్ సినిమాల‌కు ఇంట‌ర్వెల్ ఎక్కువ‌..సినిమా త‌క్కువ అంటూ విమ‌ర్శించారు. చంద్ర‌బాబు పేమెంట్ ఇస్తే ప‌వ‌న్ కాల్షీట్ ఇస్తార‌ని ఆరోపించారు. నాలుగేళ్లు చంద్ర‌బాబు తో క‌లిసి ఉన్న ప‌వ‌న్ కు ఆయ‌న చేసిన అవినీతి ..అన్యాయం లో బాధ్య‌త లేదా అని నిల‌దీసా రు. ప‌వ‌న్ త‌న స‌భ‌ల్లో చంద్ర‌బాబు గురించి త‌క్కువ మాట్లాడి..త‌న గురించి ఎక్కువ విమ‌ర్శ‌లు చేస్తార‌ని చెప్పుకొచ్చారు.

Jagan questioned Pawan four Marriages : Pawan paid artist..

జ‌గ‌న్‌..త‌న ప్ర‌సంగంలో ప‌వ‌న్ మ‌గ‌త‌నం గురించి ప‌దే ప‌దే ప్ర‌స్తావించారు. వ‌ప‌న్ క‌ళ్యాన్ నాలుగేళ్ల‌కోసారి కార్ల‌ను మార్చి న‌ట్లుగా భార్య‌ల‌ను మారుస్తార‌న్నారు. ప‌వ‌న్ కు న‌లుగురు భార్య‌లున్నార‌ని..ఇదే విష‌యం ప్ర‌స్తావించి..ఎత్తి చూపితే..ఎత్తి చూపిన వారి కుటుంబాల్లోని మ‌హిళ‌ల పై సోష‌ల్ మీడియ‌లో అస‌హ్య ప్ర‌చారం చేయిస్తార‌ని జ‌గ‌న్ దుయ్య బ‌ట్టారు. ప‌విత్ర‌మైన పెళ్లి అనే వ్య‌వ‌స్థ‌ను ప‌వ‌న్ రోడ్డు మీద‌కు తీసుకొచ్చార‌ని విమ‌ర్శించారు. నిత్య పెళ్లి కొడుకు మాది నాలుగేళ్ల‌కోసారి భార్య‌ను మార్చ‌ట‌మే మ‌గ‌త‌నమా అని ప్ర‌శ్నించారు.

ప‌వ‌న్ రెండో భార్య రేణూ దేశాయ్ ఓ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ త‌న‌తో కాపురం చేస్తుండ‌గానే ఏ ర‌కంగా వ్య‌వ‌హ‌రించాడో వివ‌రించార‌ని..దీంతో..త‌న‌తో జీవితం పంచుకున్న మ‌హిళ పై అభిమానుల‌తో ఇష్టానుసారం సోష‌ల్ మీడియాలో వేధింపుల‌కు దిగ‌టమే మ‌గ‌త‌న‌మా అని జ‌గ‌న్ నిల‌దీసారు. లాండ్ పూలింగ్ బాధితుల త‌ర‌పున నిల‌బ‌డ‌తాన‌ని చెప్పిన ప‌వ‌న్..ప‌క్కా స్కెచ్ ప్ర‌కారం లాభ‌ప‌డిన చంద్ర‌బాబు బినామీ లింగ‌మ‌నేని ర‌మేష్ వ‌ద్ద నాలుగు కోట్ల రేటు ఉన్న ప్రాంతంలో ఎక‌రాను కేవ‌లం 20 ల‌క్ష‌ల‌కే తీసుకోవ‌టం అవినీతి కాదా అని ప్ర‌శ్నించారు.

ప‌వ‌న్ త‌న సినిమా అజ్ఞాత‌వాసి కి చంద్ర‌బాబు నుండి అధిక మొత్తంలో రాయితీలు తీసుకున్నార‌ని..కోట్లు గ‌డించార‌ని ఆరోపించారు. ప‌వ‌న్ అవినీతి గురించి..తాను జైలుకు వెళ్తాడ‌ని మాట్లాడ‌టం వెనుక చంద్ర‌బాబు స్క్రిప్టు కార‌ణ‌మ‌ని విమ‌ర్శించారు. వైయ‌స్ హ‌యాంలో పాల‌న ప‌వ‌న్ చూసారా.. తాను అవినీతికి పాల్ప‌డిన‌ట్లు ప‌వ‌న్ చూసారా అని జ‌గ‌న్ నిల‌దీసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+