బెజవాడ గ్యాంగ్ రేప్- జగన్ సర్కార్ యాక్షన్ -సస్పెన్షన్లు, కాంట్రాక్టుల రద్దు-10 లక్షల పరిహారం
విజయవాడలో మానసిక వికలాంగురాలిపై ప్రభుత్వ ఆస్పత్రిలో ముగ్గురు నిందితులు 30 గంటల పాటు జరిపిన అత్యాచారంపై విమర్శలు వెల్లువెత్తాయి. నగర నడిబొడ్డున ఉన్న ప్రభుత్వాసుపత్రిలో ఇంత దారుణం జరుగుతున్నా, అంతకు ముందు యువతి అదృశ్యంపై తల్లితండ్రులు ఫిర్యాదు చేసినా స్పందించని పోలీసులపై ఆగ్రహం వెల్లువెత్తింది. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది.

అమానవీయ ఘటనపై విమర్శలు
మూడు రోజుల క్రితం విజయవాడలోని నున్నలో అదృశ్యమైన మానసిక వికలాంగురాలిపై ప్రభుత్వాసుపత్రిలో జరిగిన గ్యాంగ్ రేప్ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా ఈ ఘటనలో మూడు రోజుల పాటు నిందితులు సాగించిన అఘాయిత్యం, తల్లితండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు వెంటనే స్పందించని తీరు చర్చనీయాంశమయ్యాయి. చివరికి తల్లితండ్రులే స్వయంగా బాధితురాలైన తమ కుమార్తెను వెతుక్కున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓవైపు దిశ చట్టం అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇరుకునపడింది.

ఇరుకునపడ్డ సర్కార్
రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాల నియంత్రణ, నివారణ కోసం దిశ చట్టం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం రెండేళ్లుగా చెబుతోంది. ప్రత్యేక దిశ పోలీసు స్టేషన్లతో పాటు సిబ్బంది నియామకం, దిశయాప్, ఇలా ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇన్ని ఉన్నా విజయవాడ నగరంలో, అందునా ప్రభుత్వాసుపత్రిలోనే చోటు చేసుకున్న ఈ ఘటన సర్కార్ ను పూర్తిగా ఇరుకునపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాల్సిన పరిస్ధితి ఎదురైంది.

జగన్ సర్కార్ దిద్దుబాటు
బెజవాడలో మానసిక వికలాంగురాలైన మహిళపై సామూహిక అత్యాచార ఘటనలో బాధ్యులైన ఇద్దరు అధికారులపై సీపీ కాంతిరాణా టాటా వేటు వేశారు. నున్న పోలీసు స్టేషన్లో పనిచేస్తూ బాధితురాలి తల్లితండ్రులు ఫిర్యాదు చేసినా స్పందించని సిఐ హనీష్,సెక్టార్ ఎస్సై శ్రీనివాసరావును సీపీ సస్పెండ్ చేశారు. వీరు సకాలంలో స్పందించి ఉంటే బాధితురాలి ఫోన్ కు వచ్చిన చివరి ఫోన్ కాల్ ఆధారంగా నిందితుల్ని పట్టుకునే అవకాశం ఉండేది. అలాగే నిందితులు ప్రభుత్వ ఆస్పత్రిలో ఫాగింగ్ ఏజెన్సీ తరఫున పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిగా గుర్తించారు. దీంతో ఈ ఏజెన్సీ కాంట్రాక్టును రద్దుచేశారు. అలాగే ఆస్పత్రి సెక్యూరిటీ ఏజెన్సీ కాంట్రాక్టును కూడా ప్రభుత్వం రద్దు చేసింది.

10 లక్షల పరిహారం ప్రకటన
విజయవాడ ఆస్పత్రి ఘటనలో బాధిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైయస్.జగన్ అధికారుల్ని ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆస్పత్రి సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై సీఐ, ఎస్సైలపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవడంతో పాటు ఆస్పత్రిలో ఫాగింగ్, సెక్యూరిటీ ఏజెన్సీలకు టెర్మినేషన్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో ఈ దారుణ ఘటనపై శాఖాపరమైన దర్యాప్తు చేస్తున్నట్లు వైద్యశాఖ మంత్రి విడదల రజనీ తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications