వివేకా కేసులో రంగంలోకి పెద్ద చేపలు ? సీబీఐపై ఎదురుదాడి- ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహం
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న మాజీ మంత్రి, వైఎస్ జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో మొదట్లో బయటపడిన అంశాలకూ, ఇప్పుడు వెలుగుచూస్తున్న అంశాలకు పొంతన లేకుండా పోతోంది. అదే సమయంలో ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నతీరుపై గుర్రుగా ఉన్న వైసీపీ సర్కార్.. ఏకంగా సీబీఐ అధికారిపైనే కేసు నమోదు చేయడం సంచలనం రేపుతోంది. ఇది ఏకంగా సీబీఐనే ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహంగా తెలుస్తోంది.
Recommended Video

వివేకా కేసులో ట్విస్టులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో సాగిపోతోంది.సీబీఐ దర్యాప్తు, నిందితుల వాంగ్మూలాలు, అనుమానితుల విచారణలతో ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్ని వేడెక్కిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో జరిగింది ఒకటైతే సాక్ష్యాధారాలన్నీ మార్చేసి మరొకటి జరిగిందని చెప్పేందుకు జరిగిన ప్రయత్నాలపై సీబీఐ దృష్టిసారించింది. వీటి ఆధారంగా జరుగుతున్న దర్యాప్తులో పెద్ద చేపలు బయటికి వస్తున్నాయి. దీంతో వీరిని మరిన్ని ఆధారాలతో పక్కాగా బుక్ చేసేందుకు సీబీఐ చేస్తున్న ప్రయత్నాలకు ఏపీ ప్రభుత్వం మోకాలడ్డుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

సీబీఐపై వైసీపీ ఎదురుదాడి
వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జిషీట్ లో కడప ఎంపీ టికెట్ వ్యవహారమే మాజీ మంత్రి దారుణ హత్యకు కారణమైందని సూచన ప్రాయంగా వెల్లడించింది. అంతే కాదు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దన్నందుకే వివేకా హత్యకు గురయ్యారనే అనుమానాల్ని సీబీఐ వ్యక్తం చేసింది.
దీంతో ఈ వ్యవహారం అధికార వైసీపీ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్ సీబీఐపై ఎదురుదాడికి దిగింది. సీబీఐ దర్యాప్తు కట్టుకథలా ఉందని, దాన్ని పట్టుకుని ఓ వర్గం మీడియా తమపై దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ నేత సజ్జల ఇప్పటికే ఆరోపించారు. దీంతో సీబీఐ తీరుపై వైసీపీ గుర్రుగా ఉందనే విషయం తేలిపోయింది.

సీబీఐ అధికారిపైనే కేసు
వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న టీమ్ కు సీబీఐ ఏఎస్పీ స్ధాయి అధికారి రామ్ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. వివేకా హత్య కేసులో కీలక అనుమానితుడిగా ఉన్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని ఆయన విచారిస్తున్నారు. దీంతో ఉదయ్ ఏఎస్పీ రామ్ సింగ్ ఈ కేసులో తనను తప్పుడు సాక్ష్యం చెప్పాలని బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కడప రిమ్స్ పీఎస్ పోలీసులు రామ్ సింగ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో అనుమానితుడి ఫిర్యాదు మేరకు సీబీఐ ఉన్నతాధికారిపై ప్రభుత్వం కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.

ఉదయ్ రెడ్డి వెనుక పెద్ద చేపలు?
వివేకా కేసులో కీలక అనుమానితుడిగా ఉన్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో ఏపీ ప్రభుత్వం సీబీఐ అధికారి రామ్ సింగ్ పై కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆయన బ్యాక్ గ్రౌండ్ పై చర్చ మొదలైంది.అలాగే ఈ కేసులో ఆయన పాత్రపైనా చర్చ జరుగుతోంది. వివేకా హత్య జరిగిన సమయంలో ఉదయ్ ఇంటినుంచి తెల్లవారు జామున మూడున్నర గంటలకు ఇంటి నుంచి వెళ్లినట్లు, వివేకా ఇంటివద్ద తచ్చాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఉదయ్ తండ్రి జగన్ మామ ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆర్ఎంపీ గజ్జల ప్రకాష్ రెడ్డి.. వివేకా మృతదేహానికి కుట్లు వేశారు.
దీంతో ఇప్పుడు ఉదయ్ సీబీఐ దర్యాప్తులో చెప్పబోయే విషయాలు కీలకంగా మారిపోయాయి. వివేకా కుమార్తె సునీతారెడ్డి కూడా ఇప్పటికే హైకోర్టుకు చేసిన ఫిర్యాదులో సైతం ఉదయ్ కుమార్ రెడ్డి పేరును అనుమానితుడిగా ప్రస్తావించారు. దీంతో ఉదయ్ ను కాపాడేందుకు పెద్ద చేపలు రంగంలోకి దిగాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహం ?
వివేకా కేసులో సీబీఐ దూకుడు పెరుగుతున్న కొద్దీ వైసీపీ పెద్దల్లో అసహనం కనిపిస్తోంది. అదే సమయంలో సీబీఐపై నిరాధార ఆరోపణలతో ఎదురుదాడి చేయడం కూడా ఎంతోకాలం సాధ్యం కాదు. దీంతో ఉదయ్ కుమార్ రెడ్డి ద్వారా ఫిర్యాదు చేయించి సీబీఐ టీమ్ అధికారిని ఆత్మరక్షణలోకి నెట్టేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ ఫిర్యాదుపై సీబీఐ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో కూడా చూడాల్సి ఉంది. ప్రభుత్వం తదుపరి చర్యల ఆధారంగా సీబీఐ కూడా స్పందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications