చంద్రబాబుకు జగన్ షాక్... బీసీలకు మరో 10శాతం రిజర్వేషన్లు.. సీఎం కొత్త ఎత్తుగడ ఇలా..!

ఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50శాతంకు మించరాదు అని హైకోర్టు చెప్పడంతో ఏపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లలో కోత విధించిన సంగతి తెలిసిందే. 9.85శాతం బీసీ రిజర్వేషన్లలో కోత విధించడంతో టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతేకాదు జగన్ బీసీ వ్యతిరేకి అంటూ ప్రచారం చేయసాగింది. ఈ క్రమంలోనే సీఎం జగన్ మరో ముఖ్య నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తాము బీసీ వ్యతిరేకులమని టీడీపీ చేస్తున్న ప్రచారంను తిప్పికొట్టేందుకు కొత్త వ్యూహం రచించినట్లు సమాచారం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించడాన్ని టీడీపీ జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైసీపీ సర్కార్ బీసీలకు వ్యతిరేకమని ఇప్పటికే టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్ద పీట వేసిందని చెబుతూ వైసీపీ నిర్ణయాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసింది. అయితే చంద్రబాబు ప్రచారాన్ని జగన్ వ్యూహాత్మకంగా తిప్పి కొట్టాలని భావించి సరికొత్త ఆలోచనతో వచ్చారు.

Jagans new BC strategy:10 percent of seats from General quota to be allocated for BCs

కోర్టు తీర్పును అనుసరిస్తూనే అంటే 50శాతం రిజర్వేషన్లు మెయిన్‌టెయిన్ చేస్తూనే మరో 50 శాతం జనరల్ కోటాలో 10శాతం టికెట్లు వైసీపీ పార్టీ నుంచి బీసీలకు కేటాయించాలని వైసీపీ సీనియర్ నేతలకు సూచించారు. దీంతో జనరల్ కోటా 40శాతానికి తగ్గిపోనుండగా... వైసీపీకి చెందిన బీసీలకు మరో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు.

బీసీలకు న్యాయం చేసే నిర్ణయం సీఎం జగన్ తీసుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. బీసీలకు ఎస్సి ఎస్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 60 శాతంకు ఏ మాత్రం తగ్గకుండా తమ పార్టీ తరుపున ఎన్నికల్లో బీఫామ్ లు ఇస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు బీసీలకు చేసిన మోసాన్ని నిలదీయాలని బీసీలకు ఆయన పిలుపునిచ్చారు. జనరల్ కోటా నుంచి మరో 10శాతం బీసీలకు టికెట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న జగన్‌కు ఎమ్మెల్యే జోగి రమేష్ ధన్యవాదాలు చెప్పారు. బీఫారంలు ఇచ్చే ముందు బీసీలకు తప్పనిసరిగా 10శాతం కేటాయించాలని జగన్ జిల్లా ఇంఛార్జ్‌లకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+