స్థానిక ఎన్నికల వేళ జగన్ వ్యూహాల వెనుక - ఆ ఒక్క నిర్ణయంతో సీన్ ఛేంజ్..!!
స్థానిక ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయంగా కీలక మలుపుగా మారాయి. స్థానిక ఎన్నికల పై గత మూడు నెలలుగా మాజీ సీఎం జగన్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఎక్కడా ఏకగ్రీవం అయినా ఈ నియోజకవర్గ ఇంఛార్జ్ కు సీటు లేదని తేల్చి చెప్పారు. ఆ హెచ్చరిక మొత్తం సీన్ మార్చేసింది. ఇక.. కూటమిని రాజకీయంగా ఆత్మరక్షణలో నెట్టేలా కొత్త వ్యూహాలను అమలు చేసారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయాల వెనుక భారీ కసరత్తు జరిగింది. ఇక, ఇప్పుడు మరో కొత్త వ్యూహం సిద్దం చేస్తున్నారు.
స్థానిక ఎన్నికల వేళ గతంలో కంటే జగన్ పూర్తి భిన్నంగా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వాన్ని కార్నర్ చేయటం కోసం అన్ని అస్త్రాలను సంధించారు. జగన్ రెండు నెలల క్రితం తీసుకున్న ఒక్క నిర్ణయం మొత్తం సీన్ మార్చేసింది. తాను సీఎంగా ఉన్న సమయంలో స్థానిక ఎన్నికల వేళ చోటు చేసుకున్న పరిణామాలతో.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉందో జగన్ ముందే అంచనాకు వచ్చారు. అదే సమయంలో 11 సీట్లకే పరిమితం అయి ఇక రకంగా నిరాశలో ఉన్న కేడర్ లో జోష్ పెంచేందుకు ఇదే సరమైన సమయంగా జగన్ గుర్తించారు. వెంటనే తన కార్యాచరణ ప్రారంభించారు. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే అక్కడ ఇంఛార్జ్ కు సీటు ఉండదని తేల్చి చెప్పారు. దీంతో.. అన్ని నియోజకవర్గాల ఇంఛార్జ్ లు ముందు గానే తమ అభ్యర్ధుల విషయంలో అప్రమత్తం అయ్యారు.

జగన్ వ్యూహాలతో ముందుకు
అదే విధంగా మున్సిపల్ ఎన్నికల సమయంలో అభ్యర్ధుల ఖరారు పూర్తి చేస్తూనే జగన్ బెంగళూరు వెళ్లిపోయారు. రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్న వేళ తిరిగి విజయవాడకు వచ్చారు. గవర్నర్, ఎన్నికల సంఘంను కలిసారు. తన సహజ శైలికి భిన్నంగా ఒకే రోజు మూడు సార్లు మీడియాతో మాట్లాడారు. వైసీపీ సోషల్ మీడియా జరిగిన ఘటనలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లింది. తిరగబడాలని జగన్ పిలుపు ఇచ్చారు. దీంతో.. పార్టీలోని మహిళా నేతలు సైతం క్షేత్ర స్థాయిలో యాక్టివ్ గా పని చేసారు. సీమ జిల్లాల్లో కేడర్ మొత్తం అప్రమత్తం అయింది. అటు సుప్రీం కు వెళ్లటం.. న్యాయస్థానం ఆదేశాలు వైసీపీకి మరింత శక్తిని ఇచ్చాయి. అయితే, జగన్ కోరినట్లుగా 11 మున్సిపాల్టీ ఛైర్మన్ స్థానాలకు మాత్రం మళ్లీ నామినేషన్లకు అవకాశం దక్కలేదు. దీంతో.. మరోసారి సుప్రీంకు వెళ్లేందుకు సిద్దమయ్యారు. జాతీయ స్థాయిలోనూ ఏపీలో ఘటనలు చర్చగా మారాయి. దీంతో.. స్థానిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా... జగన్ తీసుకున్న ఒక్క నిర్ణయం మొత్తం రాజకీయంగా పరిణామాలనే మార్చేసిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications
