RRR: తిరుమల లడ్డూ, కమీషన్ల కోసం జగన్ కల్తీ నెయ్యికి ఓకే చెప్పారు
గత వైసీపీ ప్రభుత్వంలో కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఎంతటి పని చేయడానికైనా ఆ పార్టీలోని చాలా మంది ప్రయత్నించారని, వైసీపీ చేసిన పాపాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కమిషన్ల కోసం ఆశపడిన జగన్ తిరుమల లడ్డు ప్రసాదాలు తయారు చేయడానికి కల్తీ నెయ్యి సరఫరా చేయడానికి ఓకే చెప్పారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
శ్రీవారి లడ్డులకు కల్తీ నెయ్యి ఉపయోగించారని విషయంపై వస్తున్న ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు శనివారం మీడియాతో మాట్లాడారు. 2019 వరకు శ్రీవారి లడ్డూ ప్రసాదం జోలికి పాలకులు ఎవ్వరూ వెళ్లలేదని రఘురామ కృష్ణరాజు గుర్తు చేశారు. తిరుమల లడ్డు ప్రసాదంలో నాణ్యత తగ్గిందని కొంతకాలంగా శ్రీవారి భక్తులు ఆరోపిస్తున్న మాట నిజమే అని, ఆ విషయంపై గత జగన్ ప్రభుత్వంలో చాలా సార్లు వైసీపీ నాయకులు కూడా వివరణ ఇచ్చారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు గుర్తు చేశారు.

తిరుమల శ్రీవారి లడ్డుల తయారీ కోసం కల్తీ నెయ్యి వాడారని, వైసీపీ హయాంలో తిరుమలకు వెళ్లిన శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాలు ఏ విధంగా ఇచ్చి ఉంటారో అర్థం చేసుకోవచ్చని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వచ్ఛమైన నెయ్యి తోనే శ్రీవారి లడ్డు ప్రసాదాలు తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు తెలిపారు.
శ్రీవారి లడ్డు ప్రసాదంలో నాణ్యత తగ్గిందని కొంతకాలంగా శ్రీవారి భక్తులు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే అని రఘురామ కృష్ణరాజు అన్నారు. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి నిజమే అని, అది వైసీపీ నాయకులు చేసిన పాపమే అని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి విషయంలోనే అనేక పాపాలు చేశారని, అలాంటి వాళ్లను శ్రీవెంకటేశ్వర స్వామి కఠినంగా శిక్షిస్తారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు అన్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు, సామాన్య ప్రజలు ఉపయోగించే ప్రతి ఒక్కటి కల్తీ చేశారని, చివరికి కమిషన్ల కోసం కక్కుర్తిపడి తిరుమలకు సరఫరా చేసే నెయ్యి కూడా కల్తీ నెయ్యి ఇచ్చారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూలు తయారు చేశారని వెలుగు చూడటంతో దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది కోట్లాదిమంద శ్రీవారి భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయని హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications